32,100-10,050 దాటేశాయ్‌!

32,100-10,050 దాటేశాయ్‌!

మిడ్ సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లకు కొనుగోళ్ల పూనకం రావడంతో మార్కెట్లు లాభాల దౌడు అందుకున్నాయి. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ జోడు గుర్రాల్లా పరుగందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 336 పాయింట్లు జంప్‌చేసి 32,170కు చేరింది. నిఫ్టీ సైతం 105 పాయింట్లు ఎగసి 10,090ను తాకింది. తద్వారా సెన్సెక్స్‌ 32,150ను అధిగమించగా.. నిఫ్టీ 10,100 స్థాయివైపు చూస్తోంది.
నిఫ్టీ దిగ్గజాలలో
బ్లూచిప్‌ షేర్లలో హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌ 5.5 శాతం స్థాయిలో దూసుకెళ్లగా.. ఆర్‌ఐఎల్‌, సన్ ఫార్మా, అరబిందో, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, యాక్సిస్‌, హీరోమోటో, వేదాంతా 3.6-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు అల్ట్రాటెక్‌, ఐవోసీ, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ 0.8-0.4 శాతం మధ్య వెనకడుగులో ఉన్నాయి.Most Popular