ఇండస్‌ఇండ్‌ లాభం 25% అప్‌

ఇండస్‌ఇండ్‌ లాభం 25% అప్‌

ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో బ్యాంక్‌ నికర లాభం 25 శాతం ఎగసి రూ. 880 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం దాదాపు 21 శాతం పెరిగి రూ. 4,028 కోట్లను అధిగమించింది.
మొండి బకాయిలు...
స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 0.9 శాతం నుంచి 1.08 శాతానికి స్వల్పంగా పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం యథాతథంగా 0.44 శాతం వద్దే నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 1 శాతం లాభంతో రూ. 1735 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1740 వరకూ ఎగసింది. Most Popular