సెన్సెక్స్‌ దూకుడు- డబుల్‌ సెంచరీ!

సెన్సెక్స్‌ దూకుడు- డబుల్‌ సెంచరీ!

మిడ్‌ సెషన్‌ నుంచీ జోరందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,050 స్థాయిని సైతం అధిగమించింది. 233 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌ 32,000 పాయింట్ల మైలురాయిని దాటి 32,067కు చేరింది. ఇక 73 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 10,058 వద్ద ట్రేడవుతోంది.
ప్రభుత్వ బ్యాంక్స్‌ మినహా
ఎన్‌ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఒక్కటే(0.5 శాతం) నష్టపోగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ,  ఫార్మ 1.5-1 శాతం మధ్య ఎగశాయి. 
ఎఫ్‌అండోవో షేర్లలో
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎన్‌బీసీసీ 9 శాతం దూసుకెళ్లగా.. హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, జిందాల్‌ స్టీల్‌, నాల్కో, కేఎస్‌సీఎల్‌, కంకార్‌, ఎన్‌సీసీ, నిట్‌ టెక్‌, గ్రాన్యూల్స్‌ 5.3-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే జైన్‌ ఇరిగేషన్, బీవోఐ, పెట్రోనెట్, జీఎస్‌ఎఫ్‌సీ, ఓబీసీ, డిష్‌ టీవీ, భారతీ, ఆర్‌కామ్‌, గ్రాసిమ్‌, పీఎఫ్‌సీ 2.6-1.2 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular