కలర్స్‌ స్టాక్స్‌తో పండుగ కళే ఇక!

కలర్స్‌ స్టాక్స్‌తో పండుగ కళే ఇక!


కొంతకాలం క్రితం టైటానియం డైఆక్సైడ్ ధర బాగా తగ్గింది. అలాగే పండుగ సీజన్‌ కూడా ప్రతీ ఏటితో పోల్చితే కొంత ముందుగానే వచ్చింది. దీంతో కొన్ని పెయింట్స్ కంపెనీలకు ముందుగానే పండుగ వచ్చేసింది. పెయింట్స్ తయారీలో టైటానియం డైఆక్సైడ్ (TiO2) కీలక ముడి పదార్ధం.

ఆగస్ట్ నెలలో TiO2 ధరలు 6.7 శాతం మేర తగ్గాయి. జూన్‌లో 280గా ఉన్న కిలో ధర ఆగస్ట్ నాటికి రూ. 244కు తగ్గింది. పండుగ సీజన్‌కు ముందు ఇలా ధరలు దిగిరావడం సానుకూలం. గతేడాది మూడో త్రైమాసికంలో డీమానిటైజేషన్ కారణంగా సేల్స్ తగ్గిపోగా.. ఈ సారి క్యూ3లో లాభదాయకత ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా డెకరేటివ్ పెయింట్స్‌కు ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా ఊపందుకుంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికాల్లో పెయింట్ కంపెనీల మార్జిన్లు గణనీయంగా పెరగనున్నాయి. మే నెలలో 2.5 శాతం మేర పెయింట్స్ ధరలను కంపెనీలు పెంచాయి. ఆ తర్వాత రా మెటీరియల్స్ ధరలు తగ్గడం సానుకూల అంశంగా చెప్పవచ్చు. కన్సాయ్ నెరొలాక్, బెర్జర్ పెయింట్స్‌ షేర్లు గణనీయంగా లాభాలు పెంచుకోనున్నాయి.

గత ఏడాది కాలంలో కన్సాయ్ నెరొలాక్ షేర్ ధర 53 శాతం, బెర్జర్ పెయింట్స్ 25 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 21 శాతం పెరిగింది. షాలిపార్ పెయింట్స్ షేర్ 55 శాతం లాభాలతో జోరు మీదుంది. ఇదే కాలంలో ఏషియన్ పెయింట్స్ 37 శాతం, ఆక్‌జో నోబెల్ 27శాతం చొప్పున లాభపడ్డాయి. 

ఏషియన్ పెయింట్స్‌కు రూ. 1080 టార్గెట్‌తో సెల్ రేటింగ్‌ను ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కొనసాగిస్తోంది. హౌరా, రిష్రా ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 60 కోట్లను వెచ్చించనున్నట్లు బెర్జర్ పెయింట్స్ ప్రకటించింది. ఇండినేషియా విభాగం పీటీ ఏషియన్ పెయింట్స్ ఇండోనేషియా.. జావా బరత్ ప్రాంతంలో ఒక షిఫ్ట్‌కు 5వేల టన్నుల ప్లాంట్ సామర్ధ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయగా.. సెప్టెంబర్ 5న ఇందులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

బెర్జర్ పెయింట్స్, కన్సాయ్ నెరొలాక్, ఆక్‌జో నోబెల్, షాలిమార్ పెయింట్స్ షేర్ ధరలు పండుగ సీజన్‌లో బాగా పెరుగుతున్నాయని ఎస్ంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ వర్గాలు అంటున్నాయి. జీఎస్‌టీ అమలు తర్వాత భారీగా లాభపడిన కంపెనీలలో బెర్జర్ పెయింట్స్ కూడా ఉందని బ్రోకరేజ్ హౌస్ అంటోంది. ప్రొడక్ట్ ప్రొఫైల్‌ను పునర్ వ్యవస్థీకరించడంతో మార్జిన్లు బాగా పెరిగాయి. క్రూడ్ ధరలు కూడా మార్జిన్లు పెరగడానికి కారణం అయ్యాయి. 

బెర్జర్ పెయింట్స్‌కు చెందిన నేపాల్ అనుబంధ సంస్థ కూడా గత కొంతకాలంగా వ్యాపారం గణనీయంగా పెంచుకుంటోంది. తాజాగా పూనే ప్లాంట్‌లో విస్తరణ కార్యకలాపాలను కూడా కంపెనీ చేపట్టింది. 15-17 శాతం మార్కెట్ వాటా ఉండడం, క్రూడ్ఆయిల్ ధరల్లో ఒత్తిడి కారణంగా బెర్జర్ పెయింట్స్ ఆర్థిక ఫలితాలు మరింత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలున్నాయి.Most Popular