కేకేఆర్‌తో ఇన్‌ఫ్రాటెల్‌ కేక!

కేకేఆర్‌తో ఇన్‌ఫ్రాటెల్‌ కేక!

పీఈ సంస్థ కేకేఆర్‌ అధ్యక్షతన ఏర్పడ్డ కన్సార్షియం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో వాటా పెంచుకోవడానికి చూస్తున్నట్లు వెలువడ్డ వార్తలు ఈ కౌంటర్‌కు వరుసగా రెండో రోజు జోష్‌నిచ్చాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 5.25 శాతం దూసుకెళ్లి రూ. 432 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 438 వద్ద గరిష్టాన్ని తాకింది. బుధవారం సైతం ఈ కౌంటర్‌ దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 410 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
11 బిలియన్‌ డాలర్ల డీల్‌?
భారతీ ఇన్‌ఫ్రాటెల్‌తోపాటు ఇండస్‌ టవర్స్‌నూ కొనుగోలు చేసేందుకు కేకేఆర్‌ కన్సార్షియం ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు 11 బిలియన్‌ డాలర్లవరకూ వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్రాటెల్‌లో కేకేఆర్‌కు 10 శాతం వాటా ఉంది. మరోపక్క ఇండస్‌ టవర్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌కు 42 శాతం వాటా ఉంది.Most Popular