ర్యాలీ బాటలోనే అదానీ ట్రాన్స్‌!

ర్యాలీ బాటలోనే అదానీ ట్రాన్స్‌!

అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వార్తలతో అదానీ ట్రాన్స్‌మిషన్‌ కౌంటర్‌కు వరుసగా మూడో రోజు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 213 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతంపైగా దూసుకెళ్లడం విశేషం! 
ముంబైలో విద్యుత్‌ పంపిణీ
రిలయన్స్‌ ఇన్‌ఫ్రా నిర్వహిస్తున్న ముంబై నగర విద్యుదుత్పాదన, ప్రసారం, పంపిణీ బిజినెస్‌ కొనుగోలుకి ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ తెలియజేసింది. దీనిలో భాగంగా 2018 జనవరికల్లా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాతో డీల్‌ను పూర్తి చేసుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించనున్నట్లు తెలియజేసింది.Most Popular