యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

యూరప్‌ మార్కెట్లు ఫ్లాట్‌!

కాటలోనియా స్వాతంత్ర్య ప్రకటనకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసినప్పటికీ స్పానిష్‌ మార్కెట్లు నీరసపడ్డాయి. ఈ బాటలో ప్రస్తుతం జర్మనీ సైతం నామమాత్ర నష్టంతో కదులుతుంటే... ఫ్రాన్స్‌ 0.2 శాతం నష్టపోయింది. అయితే యూకే నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. సెప్టెంబర్‌ నెలకు యూరోజోన్‌ పారశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు విడుదలకానున్న నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
జస్ట్‌ ఈట్‌ హైజంప్‌
హంగ్రీహౌస్‌ కొనుగోలుకి నియంత్రణ సంస్థలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో జస్ట్‌ ఈట్‌ కౌంటర్‌ 5.5 శాతం జంప్‌చేసింది. ఇక బ్రోకింగ్‌ సంస్థలు రేటింగ్‌ను పెంచడంతో జర్మన్‌ విమానయాన సంస్థ డాయిష్‌ లుఫ్తాన్స 3 శాతం ఎగసింది.Most Popular