వాటా కొనుగోలుతో డీఐఎల్‌కు జోష్‌

వాటా కొనుగోలుతో డీఐఎల్‌కు జోష్‌

అనుబంధ సంస్థ ఫెర్మెంటా బయోటెక్‌లో వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో డీఐఎల్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 50 ఎగసి రూ. 1045ను తాకింది. 
21 శాతం వాటా 
అనుబంధ సంస్థ ఫెర్మెంటా బయోటెక్‌లో 21.05 శాతం వాటాకు సమానమైన 38.30 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు డీఐఎల్‌ పేర్కొంది. పీఈ సంస్థ ఇవోలెన్స్‌ ఇండియా లైఫ్‌ సైన్సెస్‌ ఫండ్‌ నుంచి ఈ వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది.Most Popular