ఐబీఎం దన్ను- మజెస్కో హైజంప్‌

ఐబీఎం దన్ను- మజెస్కో హైజంప్‌

టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తమ సహకారంతో  డిజైన్‌ చేసిన ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో మజెస్కో కౌంటర్‌కు భారీ డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.5 శాతం దూసుకెళ్లి రూ. 530 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 550 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
బీమా రంగ ప్లాట్‌ఫామ్‌
మెట్‌లైఫ్‌తో పాటు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బీమా రంగ ప్లాట్‌ఫామ్‌ను ఐబీఎం ప్రవేశపెట్టినట్లు మజెస్కో పేర్కొంది. ఐబీఎం క్లౌడ్‌ ద్వారా అందుబాటులోకి వచ్చిన బీమా రంగ ప్లాట్‌ఫామ్‌తో న్యూప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, అండర్‌ రైటింగ్‌ తదితర సౌకర్యాలను పొందవచ్చని తెలియజేసింది.Most Popular