ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో లాభాలతో మొదలైన మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 91 పాయింట్లు పెరిగి 31,925కు చేరగా.. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకుని 10,020 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 10,050 స్థాయివైపు కదులుతోంది.
బ్యాంకింగ్ వీక్
ఎన్ఎస్ఈలో మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగాలు 1-0.6 శాతం మధ్య లాభపడటం ద్వారా మార్కెట్లకు అండగా నిలుస్తున్నాయి. అయితే ప్రభుత్వ బ్యాంకుల ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫ్రాటెల్, హిందాల్కో 5 శాతం జంప్‌చేయగా, అరబిందో, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్, వేదాంతా, ఆర్ఐఎల్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, లుపిన్ 2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే అల్ట్రాటెక్, టాటా మోటార్స్, భారతీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, స్టేట్‌బ్యాంక్, యస్‌బ్యాంక్, ఐసీఐసీఐ, యూపీఎల్, సిప్లా 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి.
మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా అండ!
