ఆ కాంట్రాక్ట్‌తో ఎన్‌బీసీసీ, ఎన్‌సీసీ అప్‌

ఆ కాంట్రాక్ట్‌తో ఎన్‌బీసీసీ, ఎన్‌సీసీ అప్‌

పలు అంతస్తుల వాణిజ్య భవన సముదాయాల నిర్మాణానికి ఎన్‌సీసీకి కాంట్రాక్ట్‌ను ఇవ్వడంతో ఎన్‌బీసీసీ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌బీసీసీ షేరు 3.5 శాతం పెరిగి రూ. 229 వద్ద ట్రేడవుతోంది. ఇక కాంట్రాక్ట్‌ పొందిన ఎన్‌సీసీ సైతం 2.3 శాతం బలపడి రూ. 88 వద్ద కదులుతోంది.
వివరాలివీ
న్యూఢిల్లీలోని నౌరోజీ నగర్‌లోగల జీపీఆర్‌ఏ కాలనీలో పలు అంతస్తుల వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మించేందుకు ఎన్‌సీసీకి ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌బీసీసీ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. రెండేళ్లలోగా పూర్తిచేయాల్సిన ఈ  కాంట్రాక్ట్‌ విలువ రూ. 1949 కోట్లుకాగా... ఈ విలువలో ఎన్‌బీసీసీకి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ ఫీజుకింద 8 శాతం లభించనుంది. Most Popular