సెన్సెక్స్‌ సెంచరీ- చిన్న షేర్లు ఓకే

సెన్సెక్స్‌ సెంచరీ- చిన్న షేర్లు ఓకే

ప్రపంచ మార్కెట్ల జోష్‌తో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. తొలుత లాభాలతో మొదలై కాస్త వెనకడుగు వేసినప్పటికీ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 116 పాయింట్లు పెరిగి 31,950కు చేరింది. తద్వరా 32,000 మార్క్‌వైపు చూస్తోంది. నిఫ్టీ 42 పాయింట్లు ఎగసి 10,027ను తాకింది. వెరసి 10,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి ట్రేడవుతోంది.
లాభపడ్డవే అధికం
మార్కెట్ల బాటలో చిన్న షేర్లు సైతం తిరిగి గాడిలో పడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ 0.75 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,522 లాభపడగా.. 654 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. Most Popular