ఎగుమతి ఆర్డర్‌తో  జెన్‌ జోరు

ఎగుమతి ఆర్డర్‌తో  జెన్‌ జోరు

ఎగుమతి ఆర్డర్‌ లభించిన వార్తలతో జెన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3 శాతంపైగా పెరిగి రూ. 64 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 66 వరకూ ఎగసింది.
రూ. 64 కోట్లు
లైవ్‌ అండ్‌ వర్చువల్‌ కంబాట్‌ శిక్షణ అందించేందుకు కంపెనీ చరిత్రలోనే అదిపెద్ద ఎగుమతి ఆర్డర్‌ లభించినట్లు జెన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఆర్డర్‌ విలువను రూ. 64 కోట్లుగా తెలియజేసింది. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ఆర్డర్‌ను పూర్తిచేసే వీలున్నట్లు తెలియజేసింది.Most Popular