బొగ్గుతో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌కు మెరుపు

బొగ్గుతో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌కు మెరుపు

రానున్న ఐదేళ్ల కాలానికి బొగ్గు సరఫరాకు హామీ లభించడంతో ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ మెరుస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 137 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 138 వరకూ పెరిగింది. 
ఎఫ్‌ఎస్‌ఏకు రెడీ
నవంబర్‌ నుంచీ బొగ్గు నిల్వలను అందుకునేందుకు వీలుగా ఇంధన సరఫరా ఒప్పందాన్ని(ఎఫ్‌ఎస్‌ఏ) కుదుర్చుకోనున్నట్లు ప్రకాష్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. తద్వారా ఏడాదికి 2.10 లక్షల టన్నుల అదనపు కోల్‌ లింకేజీకి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే కోల్‌ ఇండియా నుంచి ఇదే విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంటును ప్రారంభించడంతో బొగ్గు అవసరాలు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.Most Popular