సన్‌ ఫార్మాకూ ఈఐఆర్‌ బూస్ట్‌

సన్‌ ఫార్మాకూ ఈఐఆర్‌ బూస్ట్‌

దాద్రా ప్లాంటుకు ఈఐఆర్‌ లభించిందన్న వార్తలతో సన్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌ పుంజుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2 శాతంపైగా పెరిగి రూ. 537 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 545 వరకూ జంప్‌చేసింది.
ఏప్రిల్‌లో తనిఖీలు
దాద్రాలోని ఫార్ములేషన్ల ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి లోపాలనూ గుర్తించలేదంటూ ఈఐఆర్‌ను జారీ చేయడంతో సన్‌ ఫార్మా కౌంటర్‌ జోరందుకున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టినట్లు కంపెనీ తెలియజేసింది. హలోల్‌ తరువాత దాద్రా... సన్‌ ఫార్మాకున్న అతిపెద్ద ప్లాంట్లలో ఒకటి కావడం గమనించదగ్గ అంశం!Most Popular