ఆసియా మార్కెట్ల జోరు

ఆసియా మార్కెట్ల జోరు

కాటలోనియా స్వాతంత్ర్య ప్రకటనకు స్పెయిన్‌ తాత్కాలికంగా బ్రేక్‌ వేయడంతో యూరోజోన్‌లో అనిశ్చితులకు తెరపడగా...  బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. గడిచిన వారం వరుసగా ఆరు రోజులపాటు రికార్డులను నెలకొల్పిన ఇండెక్సులు మరోసారి సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడగా.. ఆసియా మార్కెట్లలోనూ ఆ ఉత్సాహం కనిపిస్తోంది. 
మార్కెట్ల తీరిదీ
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో చైనా మాత్రమే(0.2 శాతం) నష్టపోగా.. మిగిలిన మార్కెట్లన్నీ బలపడ్డాయి. సింగపూర్‌, తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఇండొనేసియా, హాంకాంగ్‌ 0.7-0.3 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో థాయ్‌లాండ్‌ 0.15 శాతం లాభంతో ట్రేడవుతోంది. వడ్డీ రేట్ల పెంపు బాటలో సాగేందుకు వీలుగా అమెరికా ఫెడ్‌  ద్రవ్యోల్బణంపై దృష్టిసారించనున్న వార్తలతో డాలరు ఇండక్స్‌ రెండు వారాల కనిష్టం 92.89ను తాకింది. జపనీస్‌ యెన్‌ 112.37కు చేరగా.. యూరో 1.187 వద్ద ట్రేడవుతోంది.Most Popular