లాభాలతో మొదలై.. వెనకడుగు!

లాభాలతో మొదలై.. వెనకడుగు!

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాల కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ మొదట్లోనే నిఫ్టీ గరిష్టంగా 10,021ను తాకగా.. సెన్సెక్స్‌ 31,946 వరకూ ఎగసింది. ఆపై ట్రేడర్లు జాగ్రత్త వహించడంతో కాస్త వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 42 పాయింట్లు పెరిగి 31,876కు చేరగా.. నిఫ్టీ 12 పాయింట్లు బలపడి 9,997 వద్ద ట్రేడవుతోంది.
ఫార్మా, రియల్టీ అండ
ఫార్మా, రియల్టీ, ఐటీ రంగాలు 1 శాతం చొప్పున పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు అండగా నిలుస్తుంటే..  ప్రభుత్వ బ్యాంకు కౌంటర్లలో అమ్మకాలు మార్కెట్లను బలహీనపరుస్తున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, లుపిన్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో 2.7-0.8 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు భారతీ, ఐసీఐసీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌ 1.4-0.4 శాతం మధ్య నీరసించాయి.Most Popular