23,000 మైలురాయికి చేరువలో డోజోన్స్‌!

23,000 మైలురాయికి చేరువలో డోజోన్స్‌!

గత వారం చివర్లో సరికొత్త రికార్డుల ర్యాలీ బాట పట్టిన అమెరికా మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలను అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 42 పాయింట్లు పెరిగి 22,873 వద్ద నిలిచింది. తద్వారా 23,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఎస్‌అండ్‌పీ 5 పాయింట్లు ఎగసి 2,555 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 16 పాయింట్లు బలపడి 6,603 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం!
వడ్డీ పెంపువైపు ఫెడ్‌ చూపు
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్ష సందర్భంగా వడ్డీ రెట్ల పెంపు బాటలో సాగాలని వాంఛిస్తున్నట్లు మినిట్స్‌ ద్వారా వెల్లడైంది. అయితే ఇందుకు ద్రవ్యోల్బణం పుంజుకునేందుకు చర్యలు తీసుకోవలసి ఉన్నట్లు భావించింది. కాగా.. స్వాత్రంత్య్రాన్ని ప్రకటించుకోకుండా కాటలోనియాను స్పెయిన్‌ నిలువరించడంతో  యూరో 1.185కు బలపడింది.Most Popular