టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు నేడు

టీసీఎస్‌ క్యూ2 ఫలితాలు నేడు

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించనుంది. క్యూ2 (జూలై-సెప్టెంబర్‌)లో కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2.6 శాతం పెరిగి రూ. 30,356 కోట్లకు చేరవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 
నికర లాభం 4 శాతం అప్‌?
జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే టీసీఎస్‌ నికర లాభం కాస్త అధికంగా 4 శాతం వృద్ధి చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 6,183 కోట్లను తాకగలదని భావిస్తున్నారు. బుధవారం టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 2,500 వద్ద ముగిసింది. ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో నేడు ఈ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. Most Popular