ఇవాళ్టి ఇంట్రాడే వ్యూ.. టెక్నికల్ స్టాక్ రికమెండేషన్స్(అక్టోబర్‌ 12)

ఇవాళ్టి ఇంట్రాడే వ్యూ.. టెక్నికల్ స్టాక్ రికమెండేషన్స్(అక్టోబర్‌ 12)

ముందుగా అంచనా వేసినట్టుగానే నిన్న10,050-10,067 స్థాయిలో నిఫ్టీ భారీ అమ్మకాల ఒత్తిడికి గురయింది. డే గరిష్ట స్థాయి వద్ద షార్ప్‌ కరెక్షన్‌కు లోనైంది. నిన్న మనం చెప్పుకున్నట్టు కీలెవల్‌ 9,950 సమీపానికి వచ్చిన నిఫ్టీ 9,956 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత రెండు రోజులుగా చెబుతున్నట్టు చివరకు నిఫ్టీ షార్ట్‌టర్మ్‌ కరెక్షన్‌కు గురైంది. 

ఇక ఇవాళ నిఫ్టీ కీలెవల్‌ 9,880. ఈ సమయంలో కోలుకున్న ప్రతిసారి అమ్మకాల ఒత్తిడి తప్పకపోవచ్చు. ట్రేడర్లు అప్రమత్తంగా ట్రేడింగ్‌ చేయాలి. అన్ని లాంగ్‌టర్మ్‌ పొజిషన్లకు స్టాప్‌లాస్‌ తప్పనిసరిగా ఉండాలి. నిఫ్టీకి 10,067 స్థాయిలో గట్టి నిరోధం కనిపిస్తోంది. ఇక నిఫ్టీ తర్వాతి సపోర్ట్‌ లెవల్స్‌ 9880, 9775 పాయింట్లు. షార్ట్‌టర్మ్‌లో మార్కెట్లు మరింత అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. తాజా లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండండి.

స్టాక్‌ రికమండేషన్ :
SHORT SELL ICICIBANK FUTURES@268 
TARGET 262
STOPLOSS 271
HOLD 2 DAYS.

- సూర్య బండారి, రీసెర్చ్‌ ఎనలిస్ట్‌

 Most Popular