సంవత్ 2074 రికమెండేషన్స్

సంవత్ 2074 రికమెండేషన్స్

గత ఏడాది కాలంగా భారత స్టాక్ మార్కెట్లు నిలకడగా వృద్ధి సాధిస్తున్నాయి. నిప్టీ 10వేల పాయింట్లక కీలకమైన స్థాయిని అధిగమించింది. ఫ్రంట్‌లైన్ ఇండెక్స్‌లు అన్నీ ఈ ఏడాది ప్రారంభం నుంచి 20-22 మేర ఊపందుకున్నాయి. ఇప్పుడు దీపావళి సందర్భంగా.. రాబోయే ఏడాది కాలంపాటు బాగా పెర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉన్న స్టాక్స్ అంటూ బ్రోకరేజ్ హౌస్‌లు పలు స్టాక్స్‌ను సిఫార్స్ చేస్తున్నాయి.

మన మార్కెట్లలో ముహూరత్ ట్రేడింగ్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. హిందూ కేలండర్‌ ప్రకారం గుజరాతీలు, మార్వాడీలు ఎక్కువగా ఉండే బ్రోకింగ్ కమ్యూనిటీలో సాంప్రదాయాలకు ప్రాధానం ఎక్కువే. అందుకే దీపావళి సందర్భంగా కొత్త ఏడాదిగా భావించి అకౌంట్ సెటిల్‌మెంట్స్ చేస్తుంటారు. 

గతేడాది దీపావళి నుంచి ఈ ఏడాది అక్టోబర్ 10వరకూ సెన్సెక్స్ 14 శాతం పెరగగా.. నిఫ్టీ 16 శాతం లాభపడింది. మరి వచ్చే ఏడాది సంగతేంటి అని ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ఉన్నారు. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఈ కింద ఇచ్చిన 10 స్టాక్స్‌ను పరిగణించవచ్చని రికమెండ్ చేస్తున్నాయి.

 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
బజాజ్ ఆటో | Buy | టార్గెట్ రూ. 3,820

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బీఎస్-4 ప్రమాణాలను అమలు చేయడం కారణంగా, కొత్త నిబంధనలతో ఆటోమొబైల్ కంపెనీలు ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాత జీఎస్‌టీ కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఆటోసెక్టార్‌లో డిమాండ్ తిరిగి ఊపందుకుంటోంది. రూరల్ సెక్టార్‌లో ఆదాయం పెరగడం కారణంగా ఆదాయాలు పెరగనుండడం.. అమ్మకాలు ఊపందుకునేందుకు తోడ్పడనుంది. కొత్త లాంఛ్‌లు బజాజ్ ఆటో అమ్మకాలు పెరిగేందుకు సహకరించనున్నాయి.

 

బిర్లా కార్పొరేషన్ | Buy | టార్గెట్ రూ. 1,220
రిలయన్స్ సిమెంట్‌ను కొనుగోలు చేయడం కారణంగా నార్త్‌, ఈస్ట్‌లతో పాటు మధ్య భారతంలో ఈ కంపెనీ వ్యాపారం ఊపందుకోనందని హెచ్‌డీఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ విస్తరణ కారణంగా వెస్ట్‌లో మరింతగా అమ్మకాలు పెరగనున్నాయి. పెట్ కోక్, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లైయాష్ అధికంగా ఉపయోగించడం వంటి వాటితో ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

 

దివీస్ ల్యాబ్స్ | Buy | టార్గెట్ రూ. 1,070
దివీస్ ల్యాబ్స్ ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ విస్తరణ కార్యకలాపాలకు స్థల సేకరణలో చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే సప్లైలో కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఇంపోర్ట్ అలర్ట్ అందుకున్నా.. క్యూ1 ఆదాయాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ఏడాది ఆదాయం ఫ్లాట్‌గా ఉండే అవకాశం ఉందని, లాభాలు స్వల్పంగా తగ్గవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ | Buy | టార్గెట్ రూ. 520
2017-18 ఆర్థిక సంవత్సరం 3.7x P/EV వద్ద ఈ స్టాక్ ట్రేడవుతోంది. ఇది ఎస్‌బీఐ లిస్టింగ్ 4.1x P/EV కంటే తక్కువ కావడం గమనించాలి. అందుకే ఈ స్టాక్‌లో కొనుగోలుకు అవకాశం ఉందని బ్రోకరేజ్ హౌస్ సూచిస్తోంది. 

 

పెర్సిస్టెంట్ సిస్టమ్స్ | Buy | టార్గెట్ రూ. 780
భాగస్వామ్యాలతో డిజిటల్ బిజినెస్‌ను ఈ కంపెనీ గణనీయంగా పెంచుకుంటోంది. అలాగే నేరుగా ఆర్డర్లను పొందడంలో కూడా విజయం సాధిస్తోంది. బహుళ సంవత్సరాలకు గాను మల్టీ-మిలియన్ డాలర్ డీల్స్ ఉండడం పెర్సిస్టెంట్‌కు ప్రోత్సాహకరం.

 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్
హెచ్‌డీఎఫ్‌సీ | టార్గెట్ రూ. 2,056

ఆదాయం గణనీయంగా పెరుగుతుండడంతో.. కొన్నేళ్లుగా ఈ స్టాక్ ప్రీమియం వాల్యుయేషన్స్‌లోనే ఉంది. 2017-19 మధ్య పన్ను తర్వాతి లాభం 11.9సీఏజీఆర్ చొప్పున వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. 

 

సాగర్ సిమెంట్ | టార్గెట్ రూ. 1,025
2017-19 మధ్య ఈ కంపెనీ ఆదాయాలు 16.9 శాతం సీఏజీఆర్ చొప్పున వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. వాల్యుయేషన్స్ పరంగా చూస్తే, 61 యూఎస్ డాలర్లు/టన్ చొప్పున ట్రేడ్ అవుతోంది. మిడ్ క్యాప్ ప్లేయర్లతో పోల్చితే ఇది 25-30 శాతం తక్కువ.

 

ఇనియోస్ స్టైరొల్యూషన్ | టార్గెట్ రూ. 1,250
పోటీ మార్కెట్లో ఉన్నా కస్టమర్లకు బెస్ట్ ప్రొడక్ట్స్ అందించేందుకు కంపెనీ ప్రయత్నస్తోంది. నిలకడగా వృద్ధి సాధిస్తున్న, మంచి వాల్యూమ్స్ సాధిస్తున్న రంగాల్లో కంపెనీ వ్యాపార పరిమాణం పెంచుకుంటోంది. 

 

ఎన్ఆర్‌బీ బేరింగ్స్ | టార్గెట్ రూ. 160
వాల్యుయేషన్స్ తగిన స్థాయిలో ఉండడం, ఆటోమోటివ్స్ రంగం గ్రోత్ ఔట్‌లుక్ బాగుండడంతో ఈ స్టాక్‌ను రికమెండ్ చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. బేరింగ్స్ కంపెనీలకు ప్రీమియం వాల్యుయేషన్స్ ఉండడం.. ఎన్‌ఆర్‌బీకి కలిసొచ్చే విషయంగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ చెబుతోంది.

 

మయూర్ యూనికోటర్స్ | టార్గెట్ రూ. 450
కెపాసిటీ సమస్యలతో 2015-17 మధ్య కంపెనీ ఆదాయాలు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత డీమానిటైజేషన్ ప్రభావం ఇండస్ట్రీపై కనిపించింది. రాబోయే కాలంలో కంపెనీ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. 2018-22 మధ్య వాల్యూమ్స్ భారీగా వృద్ధి చెందవచ్చు.

 

ఎంఎం ఫోర్జింగ్ | టార్గెట్ రూ. 1,020
నిలకడైన ఫైనాన్షియల్స్ కలిగిన కంపెనీలలో ఎంఎం ఫోర్జింగ్ ఒకటి. గత 10 ఏళ్లుగా కంపెనీ రెవెన్యూ, ఎబిటా, పన్ను తర్వాతి లాభం వరుసగా 10శాతం, 9శాతం, 12 శాతం సీఏజీఆర్ చొప్పున వృద్ధి సాదించాయి. డెట్ టు ఈక్విటీ 0.6x celdjcs. రిటర్న్ రేషయో 13 శాతం కంటే ఎక్కువగానే ఉంది. రీరేటింగ్‌కు అవకాశం ఉన్న కంపెనీలలో ఇది ఒకటి.Most Popular