5 రూపాయల షేరు రూ.2500 అయింది

5 రూపాయల షేరు రూ.2500 అయింది

ఓ షేరు పది రూపాయలు లాభం ఇస్తేనే ఆనందపడిపోతాం..అదే ఓ 100 రూపాయల లాభం పంచితే గెంతులేసినంతపని చేసి సంబరపడతాం..మరి ఏకంగా రూ.1500 పెరిగితే..అది కూడా ఏడాదిలో..ఇక ఐదేళ్లు..పదేళ్లు వెనక్కి చూస్తే..ఎలా ఉంటుందో తెలుసా..మీరే తెలుసుకోండి

అవంతి ఫీడ్స్..
ఫైనాన్స్ కంపెనీ కాదు, స్టార్టప్ కాదు..ఐతే వేల్యేషన్ పరంగా మాత్రం ఒక్క దశాబ్దంలోనే రెండు బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది.1990ల నాటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా బూమ్ బాగా నడిచింది. చాలా మంది రైతులు తమ భూములను రొయ్యల చెరువులుగా
మార్చేశారు. అందులో పెద్ద రైతులతో పాటు కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రవేశించాయ్.  హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్, టాటాస్, థాపర్లు వంటి బిగ్ షాట్స్ కూడా రొయ్యల వ్యాపారంలో తమ లక్ టెస్ట్ చేసుకున్నాయ్. అలాంటి సమయంలోనే అల్లూరి ఇంద్రకుమార్ అవంతి ఫీడ్స్‌ని స్థాపించారు. ప్రొటీన్ సప్లిమెంట్లను అది కూడా రొయ్యలకు చేపలకు అందించడమనే థాట్‌ని అప్లై చేశారు. అప్పటికే రంగంలో ఉన్న విదేశీ కంపెనీలకు ధీటుగా ఎదగడమంటే చిన్నవిషయం కాదు. తైవాన్ దేశాలకు చెందిన సంస్థలదే ఈరంగంలో గుత్తాధిపత్యం నడుస్తుండగా, అవంతి సంస్థ కూడా ఓ పెద్ద సంస్థతో కలిసి పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐతే కొన్ని సంవత్సరాలకు ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఇంద్రకుమార్ చొరవతో థాయ్ యూనియన్‌తో సాంకేతిక
సహకారం కోసం డీల్ కుదుర్చుకుంది.  థాయ్ యూనియన్ అప్పట్లో అతి పెద్ద ఫీడ్ ప్రొడ్యూసర్. తర్వాత అంటే 2002లో అవంతి ఫీడ్స్ స్టాక్‌మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది,


థాయ్ యూనియన్‌తో అవంతి ఫీడ్స్‌ కొలాబరేషన్ వృధ్ది చెందుతూ పోయింది. అది అలా 2009లో సంస్థలో వాటా కొనుగోలు చేసేవరకూ వెళ్లింది. అవంతి ఫీడ్స్‌లో 25శాతం వాటా థాయ్ యూనియన్ కొనుగోలు చేసింది. అప్పటికి అవంతి ఫీడ్స్ వేల్యేషన్ 2 మిలియన్ డాలర్లకి ఎదిగింది. అప్పుడే గుజరాత్‌లో ఫీడ్ ప్లాంట్ నెలకొల్పడం సంస్థకి టర్నింగ్‌ పాయింట్‌గా ఇంద్రకుమార్ చెప్తారు. సుదీర్ఘమైన కోస్తా ప్రాంతమున్న గుజరాత్‌ రైతులు వ్యాపారులుగా, వినియోగదారులుగా మారడం సంస్థకి కలిసి వచ్చిందంటారాయన. ఐతే ఈ మార్గంలో స్థానిక సంస్థల రైతులను కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట ఐతే అవంతి ఓ పెద్ద మలుపు తిరగబోతున్న సమయంలో థాయ్ లాండ్, వియత్నాంలో ఎర్లీ మోర్టాలిటీ సిండ్రోమ్‌తో రొయ్యలు, చేపలు చనిపోవడం పెద్ద దెబ్బగా చెప్పాలి. మన దేశం నుంచి జరిగే ఆక్వా వ్యాపారంపై ఇది తీవ్రంగా ప్రభావం చూపించింది. ఇక అక్కడ్నుంచి ట్రేడ్ బ్యాన్‌ని తొలగించేందుకు ఇంద్రకుమార్ పని ఎక్కే గుమ్మం, దిగే గుమ్మంగా మారిందట. చివరికి 'వాన్నామై' అనే రకపు సీఫుడ్‌ని ఎగుమతి చేసేందుకు మాత్రం అనుమతి దక్కించుకున్నారు. అదే అవంతి ఫీడ్స్ ఫేట్ మార్చేసింది. అక్కడ్నుంచి అటు అమెరికా, ఇటు యూరప్ దేశాలకు అతి పెద్ద రొయ్యల ఎగుమతిదారుగా అవంతి ఫీడ్స్ ఎదిగింది. దేశంలో ఆక్వారంగంలో 2009లో 75వేల టన్నుల రొయ్యల ఉత్పత్తులు ఎగుమతి చేయగా..ఇప్పుడు 4లక్షల టన్నుల సరుకు ఎగుమతి అవుతోంది. ఇందులో 25-30శాతం  అవంతి ఫీడ్స్ ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి ఎదిగింది. ఇదే సంస్థ ఆదాయం 2 బిలియన్ డాలర్లకి చేర్చింది.
 సంస్థ ఆదాయం సంగతే చూసుకుంటే..2009లో రూ.69కోట్లు ఉంటే, అది ఇప్పుడు రూ.2230కోట్లకి పెరిగింది. ఇది 55శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌కి సమానం. అలానే రూ.4కోట్ల నష్టం నుంచి రూ.200కోట్ల లాభాలు ప్రకటించే స్థాయికి అవంతి ఫీడ్స్ ఎదిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ కంపెనీ కావడం తెలుగువారికి గర్వకారణంగానే చెప్పాలి. గత ఏడాది కాలంగా చూస్తే రూ.546 నుంచి రూ.2501కి షేరు ధర పెరిగింది. అదే ఐదేళ్ల క్రితం నుంచి లెక్కేస్తే రూ.38 నుంచి రూ.2501కి పెరిగింది(స్టోరీ రాసే సమయానికి)మరి ఈ స్టాక్ ఏడేళ్లక్రితం చూస్తే ఇంకా షాక్ తినడం గ్యారంటీ కేవలం రూ..5.40పైసలున్న ఈ షేరు ఇప్పుడు బీభత్సమైన ర్యాలీ నడిపిస్తుందంటే సంస్థ మేనేజ్‌మెంట్ సమర్ధతతో పాటు కాలమహిమగా కూడా చెప్పాల్సిందేMost Popular