ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ ఐపీవో దూకుడు

ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ ఐపీవో దూకుడు

ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూకట్టారు. దీంతో మంగళవారం చివరి రోజు(10)కల్లా ఇష్యూ ఏకంగా 128 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 148 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. సంపన్న వర్గాల నుంచి 377 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించాయి. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 15 రెట్లకుపైగా దరఖాస్తు చేయడం విశేషం! ఇష్యూలో భాగంగా కంపెనీ 71.24 లక్షల షేర్లను ఆఫర్‌ చేయగా.. 91.35 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.
రూ. 460 కోట్ల ఇష్యూ
ఇష్యూకి ధరల శ్రేణి రూ. 456-459కాగా.. కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.Most Popular