వచ్చే దీపావళి లోపు ఈ స్టాక్స్ అదరగొడతాయట!

వచ్చే దీపావళి లోపు ఈ స్టాక్స్ అదరగొడతాయట!


మార్కెట్లు దీపావళి పండుగకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లు భారీ ర్యాలీ చేశాయి. గత దీపావళి నుంచి ఇప్పటివరకూ ఇండెక్స్‌లు 13 శాతం మేర ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 4000వేల పాయింట్లు జమ చేసుకుంది. సెన్సెక్స్ 32 వేల పాయింట్లను అధిగమించడం.. నిఫ్టీ 10178 పాయింట్ల ఆల్‌టైం గరిష్ట స్థాయిలను తాకడం ఈ ఏడాది విశేషాలుగా చెప్పవచ్చు.

స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జోరుగా కనిపించగా స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ గరిష్టంగా 800 శాతం వరకూ ఏడాదిలోనే ఊపందుకున్నాయి. ఇండియా బుల్స్ వెంచర్స్ 800శాతం లాభపడగా.. హెచ్ఈజీ 538 శాతం, గ్రాఫైట్ ఇండియా 513 శాతం పెరిగాయి. దాదాపు ప్రతీ రంగం ఈ ఏడాది కాలంలో మంచి రిటర్న్‌లను అందించి, ఇన్వెస్టర్లలో సంతోషాన్ని నింపింది. సుదీర్ఘమైన ర్యాలీ కారణంగానే ఇది సాధ్యమైంది.

సంవత్ 2074 విషయంలో మదుపర్లు చాలా జాగ్రత్తగా షేర్లు ఎంపిక చేసుకోవాలని ఎనలిస్ట్‌లు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఒడిదుడుకులకు అవకాశం ఎక్కువగా ఉండవచ్చని అందుకే.. పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని చెబుతున్నారు.

"ఈ ఏడాది తొలి భాగంలో మార్కెట్లు ఇచ్చిన రిటర్న్‌లను పరిశీలిస్తే.. రెండో భాగంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే సంగతి అర్ధమవుతుంది. ఇన్వెస్టర్లు తమ అంచనాలను ఇప్పుడు కొంత తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే.. కొన్ని సెక్టార్లు ర్యాలీ కొనసాగించే అకాశం ఉన్నా.. ఎర్నింగ్స్ ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. రాబోయే 6 నెలల పాటు నిఫఅటీ 9700-10100 మధ్యనే తిరిగేందుకు ఆస్కారం ఉంది," అని కార్వీ స్టాక్ బ్రోకింగ్ వర్గాలు అంటున్నాయి.

సంవత్ 2074 కోసం ఈ స్టాక్స్‌ను పరిశీలించవచ్చని స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఏడాదిలో 50 శాతం వరకూ ఈ స్టాక్స్ రాబడులు అందించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

 

ఐడీబీఐ క్యాపిటల్
బాటా ఇండియా: BUY| టార్గెట్ రూ. 925| రాబడులకు అవకాశం 25%

బాటా ఇండియా దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా తన తయారీ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకుంది. వార్షికంగా 2.1 కోట్ల పాదరక్షలను తయారు చేయగల సామర్ధ్యం ఈ ప్లాంట్స్‌కు ఉంది. గతంలో బేసిక్ నీడ్స్‌పై దృష్టి పెట్టిన ఈ కంపెనీ.. ఇప్పుడు అవే స్టోర్స్‌లో ఫ్యాషన్ ఫుట్‌వేర్ అమ్మకాలను పెంచుకుంటోంది. రిటైల్ వ్యాపారం, స్టోర్స్ వ్యాపారం గణనీయంగా ఊపందుకుంటున్నాయి.

 

సైయెంట్: BUY| టార్గెట్ రూ. 645| రాబడులకు అవకాశం 27%
సాఫ్ట్‌వేర్ ఎనేబుల్డ్ ఇంజినీరింగ్, జీఐఎస్ సర్వీసులను సైయెంట్ అందింస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించగలగమనే ఔట్‌లుక్‌ను ఇవ్వడం విశేషం.

 

ఎల్ & టీ: BUY| టార్గెట్ రూ. 1425| రాబడులకు అవకాశం 25%
టెక్నాలజీ, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న ఎల్ అండ్ టీ.. పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్, మెటలర్జికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. 70 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కంపెనీ కావడం, వరల్డ్ క్లాస్ క్వాలిటీ నిర్వహించే సామర్ధ్యం, సమర్ధమైన నాయకత్వం ఉండడం సానుకూలం.

 

మనప్పురం ఫైనాన్స్: BUY| టార్గెట్ రూ. 142| రాబడులకు అవకాశం 41%
గోల్డ్‌లోన్స్ విషయంలో రెండో అత్యధిక ఏయూఎం గల కంపెనీ మనప్పురం ఫైనాన్స్. మైక్రోఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, వెహికల్ ఫైనాన్స్‌తో పాటు ఇతర కన్జూమర్ ఫైనాన్స్ విభాగంలో తన ప్రెజన్స్‌ను పెంచుకుంటోంది. ఈ తరహా స్పెషలైజ్జ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు.. రుణాలు ఇవ్వడంలో బ్యాంకులకు మించిన సౌలభ్యం ఉంటుంది. అందుకే మార్కెట్ షేర్‌ను గణనీయంగా పెంచుకోగలుగుతున్నాయి.

 

మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్: BUY| టార్గెట్ రూ. 520| రాబడులకు అవకాశం 52%
లీజర్ హాస్పిటాలిటీ రంగంలో ఉన్న కంపెనీ మహీంద్రా హాలిడేస్. వెకేషన్‌తో పాటు అనుబంధ రంగాల్లో సర్వీసులు నిర్వహిస్తోంది. వెకేషన్ ఓనర్‌షిప్.. వీఓ మెంబర్స్ నుంచి యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతోంది.


ఏంజెల్ బ్రోకింగ్
దివాన్ హౌసింగ్: BUY| టార్గెట్ రూ. 650| రాబడులకు అవకాశం 19%
హోమ్‌లోన్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతుండడం డీహెచ్ఎఫ్ఎల్‌కు సానుకూలం. రాబోయే 2-3 ఏళ్లలో లోన్ బుక్ గ్రోత్ 23 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంనచా. అలాగే ఎర్నింగ్స్ గ్రోత్ 28 శాతంగా ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ ఆశిస్తోంది.

 

కరూర్ వైశ్యా బ్యాంక్: | టార్గెట్ రూ. 180| రాబడులకు అవకాశం 26%
2011-17 మధ్య 14.9 శాతం సీఏజీఆర్‌తో కరూర్ వైశ్యా బ్యాంక్‌కు స్ట్రాంగ్‌ లోన్ గ్రోత్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో లోన్ బుక్ కన్సాలిడేట్ అయినా.. 4.7 శాతం వృద్ధి సాధించడం విశేషం. 2017-19 మధ్య బ్యాంక్ లోన్ గ్రోత్ 11 శాతంగా ఉండొచ్చని.. ఇదే సమయంలో డిపాజిట్స్ 9 శాతం పెరగచ్చని అంచనాలున్నాయి.

 

ఏషియన్ గ్రానైటో: BUY| టార్గెట్ రూ. 570| రాబడులకు అవకాశం 17%
పోటీ కంపెనీలు అయిన సోమానీ సిరామిక్స్(47శాతం), కజారియా సిరామిక్స్(61 శాతం)తో పోల్చితే.. ఏషియన్ గ్రానైటో విట్రిఫైడ్ టైల్స్ అమ్మకాలు(35 శాతం) తక్కువగా ఉన్నాయి. రీసెంట్‌గా ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్‌ను లాంఛ్ చేయడంతో.. ఈ విభాగంలోనూ అమ్మకాలు ఊపందుకుని.. ఆదాయాలు, మార్జిన్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

 

బ్లూ స్టార్: | టార్గెట్ రూ. 850| రాబడులకు అవకాశం 6%
దేశంలోని అతి పెద్ద ఎయిర్ కండిషనింగ్ కంపెనీల్లో బ్లూ స్టార్ కూడా ఒకటి. మన దేశంలో ఇప్పటికి కేవలం 3 శాతం మంది మాత్రమే ఏసీ సదుపాయం కలిగి ఉన్నారు. పొరుగు దేశమైన చైనాలో ఇది 25 శాతం కాగా.. మన దేశంలో ఈ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. బ్లూ స్టార్‌కు భవిష్యత్తులో చక్కటి అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

టీవీ టుడే నెట్వర్క్: BUY| టార్గెట్ రూ. 402| రాబడులకు అవకాశం 12%
హిందీ, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్‌లో టీవీ టుడే నెట్వర్క్ ఛానల్స్‌కు మంచి వ్యూహయర్ షిప్ ఉంది. కంపెనీకి చెందిన ఆజ్‌ తక్ న్యూస్ ఛానల్ గత కొన్నేళ్లుగా వ్యూయర్‌షిప్‌లో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఇండియా టుడే కూడా గత కొన్నేళ్లుగా మార్కెట్ వాటా పెంచుకుంటూ నెంబర్ 2 ర్యాంక్‌కు చేరుకుంది. దిల్లీ ఆజ్‌ తక్, తేజ్ ఛానల్స్‌ కూడా మంచి వ్యూయర్ షిప్‌ను కలిగి ఉన్నాయి.

 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్స్ అన్నీ ఆయా బ్రోకింగ్ కంపెనీలు ఇచ్చిన రిపోర్ట్‌ల నుంచి సేకరించడం జరిగింది. వీటిలో పెట్టుబడులపై ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ ఎటువంటి బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసేందుకు ముందు సర్టిఫైడ్ నిపుణుల సలహాలు తీసుకోగలరు. Most Popular