ఐఈఎక్స్‌ ఐపీవో నేటి నుంచి!

ఐఈఎక్స్‌ ఐపీవో నేటి నుంచి!

ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌(ఐఈఎక్స్‌)  పబ్లిక్‌ ఇష్యూ నేడు(9న) ప్రారంభంకానుంది. 11న ముగియనున్న  ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1645-1650కాగా.. తద్వారా కంపెనీ  రూ. 1,000 కోట్లను(15 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా 20 శాతం వాటాకు సమానమైన 60.65 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూకి యాక్సిస్‌ కేపిటల్‌, కొటక్‌ మహీంద్రా కేపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ నిర్వాహక సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.
విద్యుత్‌ కొనుగోలుకి వీలు..
దేశీయంగా విద్యుత్‌ కొనుగోలు, అమ్మకానికి వీలుకల్పిస్తూ ఏర్పాటైన తొలి ఎక్స్ఛేంజీగా ఐఈఎక్స్‌ ఇప్పటికే సుప్రసిద్ధమైంది. ఎలక్ట్రిసిటీ ఫిజికల్‌ డెలివరీ కోసం ట్రేడింగ్‌కు వీలు కల్పిండంతోపాటు పునరుత్పాదక ఇంధన సర్టిఫికెట్లనూ అందిస్తుంది. పవర్‌ ట్రేడింగ్‌లో  ప్రైస్‌ డిస్కవరీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లకు వీలు కల్పిస్తోంది. పవర్‌ ట్రేడింగ్‌లో దాదాపు 99 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది.
ఇతర వివరాలివీ..
దేశీయంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 4 శాతం వరకూ ఎక్స్ఛేంజీల ద్వారా ట్రేడవుతుంటుంది. ఐఈఎక్స్‌ ఆదాయం గత ఐదేళ్లలో దాదాపు 15 శాతం చొప్పున వృద్ధి సాధిస్తూ వచ్చింది. నికర లాభం సైతం ఇదే స్థాయిలో పురోగతి సాధిస్తూ వచ్చింది. అయితే మార్జిన్లు 76.3 శాతం నుంచి 74.4 శాతానికి స్వల్పంగా క్షీణించాయి. మార్చితో ముగిసిన గతేడాది(2016-17)లో రూ. 38 ఈపీఎస్‌ సాధించింది. రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉంది.Most Popular