వీడెవడు?..మామూలోడు కాదు!

వీడెవడు?..మామూలోడు కాదు!

అతని సినిమాల గురించే తెలిసినోళ్లకి అతనిది జస్ట్ బిలో యావరేజ్ స్టోరీ..కానీ వ్యాపారాల్లో మాత్రం బిగ్ టైకూన్. ప్రేక్షకులపై ఓ రకంగా  దండయాత్ర చేశాడతను. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ తన లక్ టెస్ట్ చేసుకున్నాడు(ఇక్కడ లక్ అనుకోలేం ఎందుకంటే అవి ఆడనంత మాత్రాన అతనికి నష్టమేం లేదు) ఐనా సక్సెస్ మాత్రం దూరంగానే ఉండిపోయింది. సినిమావాళ్ల క్రికెట్ లీగుల్లో తన టాలెంట్ చూపించాడు కూడా! ఈ ఇంట్రో అంతా సచిన్‌జోషి గురించే. సినిమాలు చేశాడు కాబట్టి హీరో అనాలి..క్రికెట్ బాగా ఆడతాడు కాబట్టి క్రికెటర్ అనాలి..ఐతే అతని సక్సెస్ మాత్రం బిజినెస్‌లోనే! వికింగ్స్ పేరుతో పెద్ద అంపైరే సచిన్‌జోషికి ఉంది. అదంతా తెలిస్తే నిజంగానే వీడు మామూలోడు కాదనాల్సిందే, కావాలంటే ఈ స్టోరీ చూడండి

ఎవరూ కొనని కింగ్‌ఫిషర్ విల్లాని కొనుగోలు చేసినా, ప్లేబోయ్ మేగజైన్ ఫ్రాంచైజీ దక్కించుకున్నా సచిన్‌జోషి టాలెంట్, హార్డ్ వర్కే కారణం.వ్యాపారంలో మెలకుళవలు వారసత్వంగా వచ్చాయనుకున్నా..స్క్రీన్‌పై కన్పించాలన్న తపన ఎలా ప్రారంభమైందనే సందేహం రాకతప్పదు దానికి సమాధానం ఆయన మాటల్లోనే చదవండి " పూణేలోని ప్రసిధ్దిగాంచిన ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్సి‌ట్యూట్‌కీ మా ఇంటికీ మధ్యలో గోడ ఒక్కటే అడ్డుగా ఉండేది. చిన్నప్పట్నుంచీ నేను అక్కడ జరిగే ట్రైనింగ్ సెషన్స్ ఆసక్తిగా గమనించేవాడిని. అప్పుడే కొంతమంది ఫిల్మ్  ఇన్సిట్యూట్ విద్యార్ధులు నా దగ్గరకి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేస్తావా అని అడిగేవారు. దానికి నేను ఊ కొట్టేశాను. అలా వాళ్లు తీసిన ఏడెనిమిది డాక్యుమెంటరీల్లో నటించా" అని సచిన్‌జోషి చెప్పారు. 
అలా మొదలైన సచిన్‌జోషి సినిమా కెరీర్ పెద్దయ్యాక కూడా కొనసాగింది. సచిన్ తండ్రికి స్నేహితుడైన ఓ తెలుగు నిర్మాత సాయంతో తెలుగు తెరపై మెరిశాడు. మౌనమేలనోయి అనే ఓ సినిమాతో తెరంగ్రేటం చేశాడతను. రమణగోగుల మ్యూజిక్ డైరక్షన్లో వచ్చిన ఆ సినిమా
యావరేజ్‌గా ఆడినా పాటలు మాత్రం బాగా హిట్టవడంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒరేయ్ పండు,నిను చూడక నేనుండలేను వంటి సినిమాల్లో నటించినాఅవి డిజాస్టర్స్‌గా మారడంతో ఇక తెలుగు సినిమాలవైపు చూడలేదు. ఐతే ఈ సమయంలో హిందీ సినిమాల్లో మాత్రం భారీగా ఖర్చు పెడుతూ గుర్తింపు కోసం ప్రయత్నించినా అవన్నీ నిష్ఫలం అయ్యాయ్. నసిరుద్దీన్‌షా, సన్నీలియోన్, మహేష్ మంజ్రేకర్, రామ్ గోపాల్ వర్మ లాంటి సెలబ్రెటీలతో జట్టు కట్టినా ప్రయోజనం శూన్యం. ఐతే ఇదే సమయంలో వ్యాపారంలో మాత్రం బాగా రాణించడంతో సచిన్‌జోషికి హార్దిక విజయం దక్కలేదు కానీ ఆర్ధికంగా మాత్రం పెద్దగా నష్టపోయాననే ఫీలింగ్ లేకుండా పోయింది. ఐశ్వర్యారాయ్ రీ ఎంట్రీ మూవీ జజ్బా ప్రొడ్యూసర్ కూడా ఇతనే! ఈ మధ్యనే తెలుగులోకి వీడెవడు పేరుతో, యార్ ఇవన్ పేరుతో తమిళ్‌లోకి కూడా ఓ సినిమా రిలీజ్ చేశాడు. ఇవన్నీ సచిన్‌లోని హీరోపిపాసని చాటి చెప్పాయే తప్ప సక్సెస్ మంత్రం మాత్రం పట్టుకోలేకపోయాడు. ఇదంతా ఓవైపు గోవాలో కింగ్‌ఫిషర్ విల్లా కొనుగోలు చేయడంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా అతని కామెంట్స్ ఆసక్తిగొలుపుతాయి

" నాకు విజయ్ మాల్యా ఇన్‌స్ప్రిరేషన్. అది ఎలాంటి పనులు, తప్పులు చేయకూడదనే విషయంలో మాత్రమే! ఓవర్ కాన్ఫిడెన్స్, పొగరు అనేవి తలకి ఎక్కించుకోకూడదని ఆయన్ని చూసిన తర్వాత నేను నేర్చుకున్నవి" 
అని సచిన్ అంటాడు.

అలానే ప్లానెట్ హాలీవుడ్ ‌రిసార్ట్‌ని గోవాలో నిర్మించడం కూడా వ్యాపారవర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రపంచంలో లాస్‌వేగాస్ తర్వాత ప్లానెట్ హాలీవుడ్ ఉందంటే అది ఒక్క గోవాలోనే! వికింగ్స్ బ్రాండ్ పేరుతో జేఎంజే గ్రూపులో వ్యాపారాలకు కొదవలేదు. రాజస్థాన్ జైపూర్ నివాసి అయిన జగదీష్ మోహన్‌లాల్ జోషి (జేఎంజే)కి కుమారుడు సచిన్ జోషి. ఐతే ఆ జెఎంజే గ్రూప్ సంస్థలను ఏ స్థాయికి తీసుకెళ్లాడో మీరే చూడండి

ప్లానెట్ హాలీవుడ్ తర్వాత వాల్డ్ క్లాస్ ప్లేబోయ్ లైఫ్ స్టైల్ ని కూడా 20ఏళ్లపాటు లైసెన్స్ దక్కించుకున్నాడు సచిన్ జోషి. ప్లేబోయ్ కేఫ్, ప్లేబోయ్ క్లబ్స్,లాంజ్, బీర్ గార్డెన్స్, ప్లేబోయ్ హోటల్స్,  ఇలా విలాసవంతమైన వ్యాపారాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా నెలకొల్పగల హక్కులు సాధించడం ద్వారా ఇండియాలో హైఫై ప్రొఫైల్ ఇండివిడ్యువల్స్‌కి ఓ ప్లాట్‌ఫామ్ అందించాడు. ముంబై, హైదరాబాద్, ఢిల్లీల్లో ఇలాంటి క్లబ్స్ స్టార్ట్ చేయగా. పూణే, ఢిల్లీ , హైదరాబాద్‌లో బీర్ గార్డెన్స్ ప్రారంభించారు. వచ్చే ఏడాదికి వీటి సంఖ్య 30కి పెరగనుందని వికింగ్స్ సంస్థ చెప్తోంది. ఇంతా చేస్తే సచిన్ జోషి వయసు జస్ట్ 33 సంవత్సరాలే పూణేలో 18ఎకరాల్లో ఓ టౌన్ షిప్ కూడా వికింగ్స్ సంస్థ నిర్మిస్తోంది. " ప్రతి కొత్త ప్రాజెక్టూ నాకు కొత్త మైలురాయి అధిగమిస్తున్నట్లే అన్పిస్తుంది" అంటాడు సచిన్

ఇక సచిన్ జోషి పోర్ట్‌ఫోలియోలో  ఎప్పట్నుంచో లాభాలు తెస్తోన్న వ్యాపారం లిక్కర్ బిజినెస్. గోవాలో ఇంపాలా డిస్టిలరీస్ నుంచి కింగ్స్ బీర్ బ్రాండ్ కొన్న తర్వాత ఆల్కహాల్ పోర్ట్‌ఫోలియో బాగా విస్త్రతమైంది. బ్లెండెడ్ విస్కీ ప్రొడక్ట్స్‌లో రాయల్ ఓక్ యాడ్ చేయగా, ఫ్రాన్స్‌లో త్వరలోనే ఓ వైన్‌యార్డ్ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉంది వికింగ్స్ వెంచర్స్. ఆల్కహాల్‌తో పాటు ట్రిపుల్ ఎక్స్ ఎనర్జీ పేరుతో లైఫ్ , పానీ అని రెండు ప్యాకేజ్డ్ వాటర్ సేల్స్ కూడా చేస్తోంది.


ఆటలంటే ఇష్టపడే సచిన్ జోషి, చిన్నతనంలో ఫుట్‌బాల్ బాగా ఆడేవాడట. అలానే క్రికెట్‌లో మంచి పేరు తెచ్చుకున్నా, గాయపడటంతో దానికీ స్వస్తి చెప్పాల్సి వచ్చిందంటాడు. ఐతే తెలుగువారియర్స్‌కి ఆడటంతో తనలోని తృష్ణని అలా తీర్చుకుంటున్నాడిప్పుడు. ఇండియన్ పోకర్ లీగ్‌లో గోవాకింగ్స్ ని రాజ్‌కుంద్రా(శిల్పాషెట్టి భర్త)‌తో కలిసి ప్రాంఛైజీ కొనుగోలు చేసిన సచిన్‌జోషి పూర్తి శాకాహారి కావడమే కాకుండా, పెటాలో యాక్టివ్ మెంబర్ కూడా!

సచిన్‌జోషి ఇతర అలవాట్లు నమ్మకాల్లో న్యూమరాలజీ కూడా ఒకటి. అందుకే తన కంపెనీ పేరు వికింగ్స్‌(viikings)లో రెండు ' i ' లు ఉంటాయి. ఈ మధ్యనే కొన్నకింగ్ ఫిషర్ విల్లా కూడా వెంటనే పేరు మార్చేశాడట. ఎవరైనా ఇప్పుడు దాన్ని కింగ్‌ఫిషర్ విల్లా అని పిలిస్తే వెంటనే చిర్రెత్తుకొస్తోందట మనోడికి.  సరే న్యూమరాలజీలో ఎంత నమ్మకున్నా, కష్టపడి పనిచేస్తేనే ఫలితాలొస్తాయనే విషయాన్ని కూడా పాటిస్తాడితడు. రోజుకి 10-12 గంటల పని చేయందే నిద్రపోడట. దాంతో పాటే సెలవులు తీసుకోవడం కూడా నచ్చదట. బ్రిటీష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడనే నానుడిలా తన సామ్రాజ్యం విస్తరించాలనేది సచిన్ లక్ష్యమట. ఐతే అది ప్రపంచాన్ని జయించడంలో కాదని..తన వ్యాపారాల విషయంలో మాత్రమే అని అందుకే ప్రతి సెగ్మెంట్‌లో తన ముద్ర వేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు
చెప్తాడు. ప్లేబోయ్, గోవా, బీర్ బిజినెస్ ఇలాంటివి గుర్తొచ్చినప్పుడల్లా ఓ వ్యక్తి రూపం మన ముందు కదలాడుతుంది అదే విజయ్ మాల్యా అయితే వీళ్లిద్దరి మధ్యా పోలిక తెస్తే మాత్రం సచిన్‌ అసహనం వ్యక్తం చేస్తాడు. " మితిమీరిన ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యధోరణి ఉంటే మనుషులు ఎలా పతనం అవుతారో, మాల్యాని చూస్తే తెలుస్తుంది. వాటి నుంచి నేను ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. కానీ ఆయనలా ఎప్పటికీ మారను" అంటాడు. ఇదే యాటిట్యూడ్‌తో బిలియన్ డాలర్ బిజినెస్ చేయాలనేది అతని లక్ష్యంMost Popular