ఎంఏఎస్‌కు తొలి రోజే మంచి స్పందన!

ఎంఏఎస్‌కు తొలి రోజే మంచి స్పందన!

ఎంఏఎస్‌  ఫైనాన్షియల్‌ పబ్లిక్‌ ఇష్యూకి తొలి రోజే(శుక్రవారం) మంచి స్పందన లభించింది. ఆఫర్‌లో భాగంగా కంపెనీ 71.24 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. 74.72 లక్షల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 456-459కాగా.. తద్వారా కంపెనీ రూ. 460 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ మంగళవారం(10న) ముగియనుంది. 
యాంకర్‌ ఇన్వెస్టర్లు ఓకే
ఇష్యూలో భాగంగా గురువారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 136 కోట్లను సమీకరించింది. 15 సంస్థలకు షేరుకి రూ. 459 ధరలో 29.61 లక్షల షేర్లను విక్రయించింది. 
కంపెనీ పనితీరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ రూ. 104 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 24 కోట్ల నికర లాభం ఆర్జించింది. గుజరాత్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ దేశవ్యాప్తంగా నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్యకాలాపాలను విస్తరించింది. ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది. Most Popular