డివిడెండ్స్ భారీగా ఇచ్చే టాప్-15 డిఫెన్సివ్ స్టాక్స్

డివిడెండ్స్ భారీగా ఇచ్చే టాప్-15 డిఫెన్సివ్ స్టాక్స్

మార్కెట్లు బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్న పరిస్థితుల్లో వాల్యుయేషన్స్ అందుబాటులో ఉండే స్టాక్స్‌ను పట్టుకోవడం చాలా క్లిష్టమైన విషయం. అనేక స్టాక్స్ లాంగ్-టెర్మ్ యావరేజెస్‌ కంటే చాలా అధికంగా అనేక స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. 

పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునే సమయంలో ఇన్వెస్టర్లు బ్యాలెన్సెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. అనేక మంది ఇన్వెస్టర్లు మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం, తమ క్యాపిటల్‌ను భారీగా పెంచగలిగే సామర్ధ్యం ఉన్న స్క్రిప్స్ కోసం వెతుకుతుంటారు. ఇదే సమయంలో సీజనల్ ఇన్వెస్టర్లు మాత్రం డివిడెండ్ భారీగా ఇచ్చే స్టాక్స్ ద్వారా డిఫెన్సివ్‌గా వ్యవహరిస్తూ ఉంటారు.

క్యాపిటల్ అప్రిసియేషన్ జరిగినా జరగకపోయినా, ప్రైస్ గ్రోత్‌లో డివిడెండ్ ద్వారా లభించే ఆదాయం కీలకం. అయితే, మార్కెట్లలో ఏ విషయానికీ గ్యారంటీ ఉండదు కాబట్టి డిఫెన్సివ్ స్టాక్స్‌గా వీటిని వ్యవహరిస్తారు.

అత్యధికంగా డివిడెండ్‌ను చెల్లించే కంపెనీలలో హిందుస్తాన్ జింక్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, క్యాస్ట్రాల్ ఇండియా, బజాజ్ కార్ప్, ఇన్‌ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, వీఎస్‌టీ ఇండస్ట్రీస్, హీరో మోటో కార్ప్ వంటి షేర్లు ఉన్నాయి.

కంపెనీ పేరు రాబడి(%)
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 95
స్వరాజ్ ఇంజిన్స్ 54
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 35
హీరో మోటోకార్ప్ 24
హిందుస్తాన్ జింక్ 23
ఆర్ఈసీ 23
వీఎస్‌టీ ఇండస్ట్రీస్ 18
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 18
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 8
హాకిన్స్ కుకర్స్ 6
బజాజ్ కార్ప్ 4
అసీల్యా కాలే -0.3
క్యాస్ట్రాల్ ఇండియా -6
మైండ్ ట్రీ -8
కోల్ ఇండియా -9
ఇన్ఫోసిస్ -10


అత్యధికంగా డివిడెండ్ చెల్లించిన టాప్-15 కంపెనీల్లో 10 స్టాక్స్ సానుకూల రాబడులు అందించగా.. 5 స్క్రిప్స్ మాత్రం మదుపర్ల సొమ్మును దాదాపు 10 శాతం వరకూ నష్టపరిచాయి. అయితే, ఈ అధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీలు మదుపర్లు ఆశించిన స్థాయిలో రాబడులు అందించలేకపోయినా.. ఇండెక్స్‌లు నష్టాల బాటలో ఉన్నపుడు కూడా ఇవి దాదాపు స్థిరంగా కొనసాగేందుకు ప్రయత్నిస్తుంటాయి.

క్యాష్‌ఫ్లోస్‌లో డివిడెండ్ ఆదాయం అత్యంత కీలకమైన విషయంగా చెప్పవచ్చు. ఒక కంపెనీ తమ షేర్‌హోల్డర్లకు పంచే లాభాల్లో వాటానే డివిడెండ్‌గా చెప్పవచ్చు. ఒక షేరుకు ఫేస్ వాల్యూపై డివిడెండ్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయానికి పన్ను రాయితీ ఉంటుంది. అయితే ఒక దేశీయ కంపెనీ ద్వారా రూ. 10 లక్షలకు మించిన డివిడెండ్ అందుకుంటే మాత్రం 10 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పెట్టుబడికి ముందు వీటిని పరిశీలించాలి
పన్ను లేకుండా క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి? అయితే, ఆ కంపెనీ అధికంగా డివిడెండ్ ఎందుకు చెల్లిస్తుందనే అంశంపై మదుపర్లకు అవగాహన ఉండాలి. ఇలా లాభాలు పంచేయడం ఎందుకు అనే అంశం తెలుసుకోవాలి. ఒకవేళ కంపెనీకి అభివృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయా.. లేక అదే వ్యాపారంలో మరింత మొత్తాన్ని పెట్టుబడి చేసేందుకు కంపెనీ సిద్ధంగా లేదా అని అలోచించాలి.

స్టాక్స్‌ను గుర్తించేందుకు 2 ముఖ్యమైన అంశాలు
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చేయడానికి మూలధనం పెరుగుదల అయినా, డివిడెండ్స్ పొందడం అయినా కారణాలుగా ఉంటాయి.
డివిడెండ్ కోసమే పెట్టుబడులు చేస్తున్నా, ఇన్వెస్ట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకునే ముందు విస్తృతమైన పరిశోధన చేయాలి.
పే-అవుట్స్ చేయడంలో నిలకడ, స్టాక్ ప్రైస్‌లో మూవ్‌మెంట్‌లను నిశితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది.Most Popular