ఆ.. రిటైల్‌ స్టాక్స్‌కు హైపర్‌సిటీ జోష్‌!

ఆ.. రిటైల్‌ స్టాక్స్‌కు హైపర్‌సిటీ జోష్‌!

అటు షాపర్స్‌ స్టాప్‌, ఇటు ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జోరందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో షాపర్స్‌స్టాప్‌ 3.5 శాతం ఎగసి రూ. 525ను తాకింది. తొలుత రూ. 552 వరకూ జంప్‌చేసింది. ఇక ఫ్యూచర్‌ రిటైల్‌ సైతం 3.3 శాతం పెరిగి రూ. 545 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 559 వద్ద గరిష్ట్నానికి చేరింది.
హైపర్‌సిటీ విక్రయం
హైపర్‌సిటీ రిటైల్‌లో 51.09 శాతం వాటాను ఫ్యూచర్‌ రిటైల్‌కు విక్రయించే అంశాన్ని బోర్డు గురువారం అనుమతించినట్లు మాతృ సంస్థ షాపర్స్‌ స్టాప్‌ బీఎస్ఈకి వెల్లడించింది. డీల్‌ విలువను రూ. 655 కోట్లుగా మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు హైపర్‌సిటీ కొనుగోలుకి  బోర్డు  అనుమతించినట్లు ఫ్యూచర్‌ రిటైల్‌ సైతం బీఎస్ఈకి తెలియజేసింది. 
డీల్‌ వివరాలివీ..
కె.రహేజా గ్రూప్‌ కంపెనీ షాపర్స్‌ స్టాప్‌.. అనుబంధ సంస్థ హైపర్‌సిటీలో మెజారిటీ వాటాను విక్రయిస్తుండగా.. బిగ్‌ బజార్లను నిర్వహించే కిశోర్‌ బియానీ.. ఫ్యూచర్‌  గ్రూప్‌ కొనుగోలు చేస్తోంది. ఇందుకు మొత్తం రూ. 655 కోట్లను వెచ్చిస్తోంది. నగదు రూపేణా రూ. 155 కోట్లు, షేర్ల జారీ ద్వారా మరో రూ. 500 కోట్లను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ నష్టాలు ఆర్జిస్తున్న హైపర్‌సిటీ రిటైల్‌ ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో 19 భారీ ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. Most Popular