ఇంటి లోన్ పై రూ.2లక్షల సబ్సిడీ పొందడం ఇలా!

ఇంటి లోన్ పై రూ.2లక్షల సబ్సిడీ పొందడం ఇలా!

కేంద్రప్రభుత్వం రియాల్టీ సెక్టార్ ఊపందుకోవడానికి కానీయండి మరింత మంది ప్రజలకు వెసులుబాటు కల్పించడానికి కానీయండి మరో రెండేళ్లపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ గడువు పెంచింది. దీంతో ప్రత్యక్షంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగుపడతాయి. పరోక్షంగా లోన్లు ఇచ్చిన బ్యాంకులు బాగుపడతాయ్. ఎక్కువ వ్యాపారం, తక్కువ లాభంతో ఎక్కువ ఆదాయం పొందే వీలు కలుగుతుంంది

ఐతే ఈ సబ్సిడీ ఎలా పొందాలనే ఆలోచన అందరిలో కలుగుతుంది. అవి ఒకటొకటిగా చూద్దాం

మొదట  ఈ పథకం మొట్టమొదటిసారిగా కొన్న ఇంటి అప్పుపై మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒకే వ్యక్తి రెండో ఇల్లు కొంటే కుదరదు. ఓ వేళ అదే వ్యక్తి ఇంట్లోని ఇఁకో కుటుంబసభ్యుడు ఆయన పేరుతో కొనుగోలు చేస్తే వర్తిస్తుంది.

రెండోది  వివిధ రకాల ఆదాయం కేటగరీల కింద వివిధ వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ఆరులక్షలరూపాయలు అంతకంటే తక్కువ ఆదాయం  ఉన్నవారికి, రూ.6-12లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి, రూ.12-18లక్షల ఆదాయం ఉన్నవారికి స్కీమ్ అమలు అవుతుంది

మూడోది ఆదాయంతో పాటు ఇంటి నిర్మాణపు వైశాల్యం, పరిధిని బట్టి కూడా పథకం ఉంటుంది. రూ.6లక్షల్లోపు ఆదాయం ఉన్నవారి ఇంటి నిర్మాణం 60 చదరపు మీటర్లు(643 చదరపు అడుగులు)లోపే ఉండాలి. తర్వాతి కేటగరీ రూ.6-12లక్షల్లోపు ఆదాయం ఉన్నవారి ఇంటి నిర్మాణం 90 చదరపు మీటర్లు(965 చదరపు అడుగులు)లోపు ఉండాలి. రూ.12-18లక్షల ఆదాయం ఉన్నవారికి 120 చదరపు మీటర్లు(1287 చదరపు అడుగులు) లోపు ఇంటి నిర్మాణం ఉండాలి.

ఇక ఆదాయం విషయానికి వస్తే,మొత్తం కుటుంబం ఆదాయం లెక్కలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకు ఓ ఫ్యామిలీలో భర్త, భార్య, అతని అవివాహితులైన సంతానం ఆదాయం పరిగణిస్తారు. కింద బొమ్మలో ఇచ్చిన విధంగా వడ్డీ రాయితీలు వర్తిస్తాయి

MIG( మిడిల్ఇన్ కమ్ గ్రూప్)  రూ.6-12లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి  రూ.9లక్షల లోన్ కి 4శాతం వరకూ వడ్డీ రాయితీ లభిస్తుంది. అదే 12-18లక్షలరూపాయల ఆదాయం ఉన్నవారికి రూ.12లక్షల  లోన్ కి 3శాతం వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంది. ఇదే పథకం కింద లోయర్ ఇన్ కమ్ గ్రూప్, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ల వారికి కూడా 15ఏళ్ల నుంచి 20 ఏళ్లపాటు రుణకాల పరిమితి పెంచింది. ఏతావాతా మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ అంటే  మధ్యస్థ ఆదాయ వర్గాల వారికి రూ.2.44లక్షల సబ్సిడీ లభిస్తుంది(రూ.9లక్షల రుణానికి). అదే 12లక్షలరూపాయల అప్పుకి రూ.2.48లక్షల వడ్డీ రాయితీ లభిస్తుంది.

ఇక ఇదెలా గృహయజమానులకు ఊరటనిస్తుందంటే, వడ్డి సబ్సిడీ 4శాతం ఉండటంతో ఈఎంఐలను రూ.2062కి తగ్గిస్తుంది(రూ.9లక్షల లోన్). అదే రూ.12లక్షల ఋణానికైతే 3శాతం వడ్డీ రాయితీతో ఈఎంఐని రూ.2019 తగ్గిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న8.5శాతం వడ్డీ రేటుని ఆధారంగా చేసుకుని లెక్కించింది. ఈ లెక్కలన్నీ బ్యాంకులే ముందుగా కట్టేసి అప్పు తీసుకున్న కస్టమర్ ఖాతాలో జమచేయడంతో మొత్తంగా కట్టాల్సిన ఋణంలో మినహాయించబడుతుంది. అలా లోన్ అమౌంట్ ముందే తగ్గిపోవడంతో కట్టాల్సిన ఈఎంఐ కూడా భారీగా తగ్గుతుంది. 

జూన్ ,2015లో ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ 2020 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదంతో ముందుకు వెళ్లింది. మొదటగా బలహీనవర్గాదాయాలు, అల్పాదాయ వర్గాలవారికే వర్తింపజేసినా..ఇప్పుడు అందరికీ వర్తింపజేశారు. జనవరి 1, 2017 తర్వాత కొత్తగా ఇళ్లు కట్టాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇందులో అవకాశం కల్పించారు. 

ఇప్పుడు స్కీమ్ గురించిన అర్హతలు, ఇతర వివరాలన్నీ తెలుసుకున్నారు కదా, ఇందులో భాగంగా రాయితీ పొందాలంటే బ్యాంకర్లను సంప్రదిస్తే గ్రౌండ్ రియాల్టీ కూడా తెలుస్తుందిMost Popular