క్యూ3లో ఈ 26 స్టాక్స్ మళ్లీ మల్టీబ్యాగర్స్ అవుతాయా?

క్యూ3లో ఈ 26 స్టాక్స్ మళ్లీ మల్టీబ్యాగర్స్ అవుతాయా?

చరిత్ర రిపీట్ అవుతుందో లేదో చెప్పడం కష్టమే కానీ.. మార్కెట్లలో మాత్రం హిస్టరీని ఆధారం చేసుకుని చాలానే కనిపిస్తాయి. ఇప్పుడు 2017-18 ఆర్థిక సంవత్సరానికి మూడో త్రైమాసికం ప్రారంభమైంది. అక్టోబర్ 1- డిసెంబర్ 31.. క్యూ3పై చాలామంది ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎధురుచూస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా అవతరించాయి. 

ఇప్పుడు సెప్టెంబర్ త్రైమాసికం ముగిసి, క్యూ3 ప్రారంభం అయింది. మార్కెట్లు కొంత కన్సాలిడేషన్‌కు గురైనా, ఇప్పటికీ బుల్‌జోష్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయా స్టాక్స్ స్పందిస్తాయని మదుపర్లు ఆశిస్తున్నారు. 

గతేడాది క్యూ3లో 27 స్టాక్స్ మల్టీ బ్యాగర్స్‌గా అవతరించి, 250 శాతం వరకూ రిటర్న్‌లను ఇచ్చాయి. ఇదే సమయంలో నిఫ్టీ 5 శాతం మేర పతనం అయినా సరే.. ఈ 27 స్టాక్స్ మాత్రం మల్టీబ్యాగర్స్ కావడం విశేషం.
ఇప్పుడు ఇండెక్స్‌లలో బుల్ జోష్ కనిపిస్తుండడంతో.. మళ్లీ ఈ స్టాక్స్‌లో ర్యాలీ కోసం మదుపర్లు ఆశిస్తున్నారు.

2016-17 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మల్టీ బ్యాగర్స్‌గా అవతరించిన స్టాక్స్‌లో ఎస్ఈ పవర్, కుశాల్ ట్రేడ్‌లింక్, ఇండియా మెటల్స్, వామా ఇండస్ట్రీస్, హెచ్ఎం షుగర్ మిల్స్, ఇండోకెమ్, అట్లాస్ జ్యూవెల్లరీ, నీరజ్ సిమెంట్‌తో పాటు మరికొన్ని స్టాక్స్ ఉన్నాయి.

 బీఎస్ఈ(స్మాల్‌క్యాప్+మిడ్‌క్యాప్)
కంపెనీ పేరు 2016 క్యూ3
ఎస్ఈ పవర్ 250
కుశాల్ ట్రేడ్‌లింక్ 224
క్రెటో సిస్కాన్ 224
మహారాష్ట్ర ఏపీఎక్స్ 191
ఇండియన్ మెటల్స్ 175
ఇంటెన్స్ టెక్ 168
మొస్‌చిప్ సెమికండక్టర్స్ 166
కోసిన్ 163
మిల్లిటూన్స్ 157
కర్మ ఎనర్జీ 153
స్వాన్ ఎనర్జీ 152
రాధా మాధవ్ 152
వామా ఇండస్ట్రీస్ 137
ఎంపీఎస్ ఇన్‌ఫోటెక్నిక్స్ 136
భారతీయ గ్లోబల్ 131
ఫోటో కెమ్ 127
కేఎం షుగర్ మిల్స్ 126
ఇండోకెమ్ 124
అట్లాస్ జ్యూవెల్లరీ 119
ఆటో రైడర్స్ ఫైనాన్స్ 113
ఇండియా హోమ్ 112
కాల్స్ రిఫైనరీస్ 111
సైబర్‌మేట్ ఇన్‌ఫో 107
సిన్నర్ ఎనర్జీ 105
కవిత్ ఇండస్ట్రీస్ 105
నీరజ్ సిమెంట్ 103

ఇక బీఎస్ఈ 500 జాబితాను చూస్తే స్వాన్ ఎనర్జీ 152 శాతం పెరగగా స్టెరిలైట్ టెక్నాలజీస్, ఈఐఎల్, చంబల్ ఫెర్టిలైజర్స్, సొనాటా సాఫ్ట్‌వేర్, వేదాంత, వెల్‌స్పన్ ఇండియా, జీఎస్ఎఫ్‌సీ, శిల్పా మెడికేర్, క్యాప్లిన్ పాయింట్, ఇన్ఫీబీమ్, బామర్ లారీ, నాల్కో, మొయిల్, అదాని ట్రాన్స్‌మిషన్ వంటి స్టాక్స్ 20-50 శాతం మధ్య ఊపందుకున్నాయి.
 

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం మార్కెట్లకు కూడా చాలా కీలకం అని చెప్పాలి. అభివృద్ధికి మద్దతునిచ్చే చర్యలను కేంద్రప్రభుత్వం చేపడుతుండడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉండడం, ఆర్బీఐ డిసెంబర్‌లో మరోసారి ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనుండడం కీలక అంశాలుగా చెప్పవచ్చు. దేశీయంగా అభివృద్ధితో పాటు డిమాండ్ పెరుగుతుండడాన్ని కూడా గమనించాలి.
 Most Popular