హోమ్‌లోన్‌ తీసుకుంటే

హోమ్‌లోన్‌ తీసుకుంటే

కస్టమర్లకు పండగ ఆఫర్‌ను ప్రకటించింది దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌. రిటైల్‌ హోమ్‌ లోన్‌లపై ఒకశాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడించింది. కొత్తగా తీసుకునే గృహ రుణాలపై ప్రతీ ఈఎంఐ పైనా 1 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ ప్రవాస భారతీయులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. 

మూడేళ్ళ తర్వాత(రుణంపొందిన 36 నెలల తరువాత) తొలి విడత  క్యాష్‌ బ్యాక్‌ సొమ్మును నేరుగా ఖాతాదారుడి  అకౌంట్‌లో జమ  చేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలియజేసింది. ఇక ఆ తరువాత నుంచి ఏడాదికోసారి ఈ క్యాష్‌ బ్యాక్‌ను అదే అకౌంట్లో క్రెడిట్‌ కానుంది. కనిష్టంగా 15 ఏళ్ళ కాలపరిమితి గృహ రుణాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉందని తెలిపింది. Most Popular