ఆ బిడ్ తో ఒబెరాయ్ రియల్టీ జూమ్

ఆ బిడ్ తో ఒబెరాయ్ రియల్టీ జూమ్

గ్లాక్సో స్మిత్ క్లెయిన్ కన్జూమర్(జీఎస్ కే) కు చెందిన సుమారు 60 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు ఒబెరాయ్ రియల్టీ వేసిన బిడ్ ఎంపికైనట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్ వైపు చూపు మరల్చారు. ప్రస్తుతం ఎన్ఎస్ ఈలో ఒబెరాయ్ రియల్టీ షేరు 6.3 శాతం జంప్ చేసి రూ. 434 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 440 వరకూ ఎగసింది.
రూ. 555 కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని విక్రయించేందుకు ఒబెరాయ్ రియల్టీ సంస్థ వేసిన బిడ్ ను ఎంపిక చేసినట్లు జీఎస్కే ప్రకటించింది. దీంతో ఒబెరాయ్ కౌంటర్ కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular