ప్రతి క్యు3లో సూపర్ ప్రాఫిట్స్ పంచుతోన్న హైదరాబాద్ స్టాక్

ప్రతి క్యు3లో సూపర్ ప్రాఫిట్స్ పంచుతోన్న హైదరాబాద్ స్టాక్

పండగల సీజన్లో దాదాపుగా ప్రతి ఇంట్లో పిండివంటలు చేయడం, సేమ్యా పాయసాలు ఘుమఘుమలాడటం సహజం.అలాంటి సేమ్యా వంటకాలకి ప్రసిధ్దిగాంచిన పేరు ఒకటుంది. అదే, బాంబినో వర్మిసెల్లి. ఇది మన సికింద్రాబాద్ బేస్డ్ కంపెనీ . విచిత్రంగా ప్రతి థర్డ్ క్వార్టర్‌లో అంటే అక్టోబర్-డిసెంబర్ సీజన్‌లో గత ఐదేళ్లుగా 35శాతం వరకూ లాభాలు పంచుతోంది
ఇలా మంచి రిటర్న్స్ ఇస్తోన్న కంపెనీలు ఇంకేమైనా ఉన్నాయా అని బిఎస్ఈ మొత్తం వెతికినా..ఇదొక్క కంపెనీనే కన్పించడం మరో విశేషం.


పస్తా, వర్మిసెల్లి మేకర్ అయిన బాంబినో ఆగ్రో ప్రొడక్ట్స్ , గత ఆరేళ్లలోఇన్వెస్టర్లకి 600శాతం లాభాలు తిరిగిచ్చింది. ఐనా ఇదో స్మాల్‌క్యాప్ స్టాక్‌గానే చూస్తారు. వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఇలాంటి స్టాక్స్‌లో కొనుగోళ్లు ఈజీనే కానీ ఏదైనా జరిగి, నష్టపోవడం జరిగినప్పుడు తిరిగి అమ్మాలంటే కుదరదని చాలామంది చెప్తుంటారు. 

గత ఐదు సంవత్సరాల లెక్కలే చూస్తే, బాంబినో ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రతి సెప్టెంబర్ క్వార్టర్లో రూ.70కోట్లకి మించిన అమ్మకాలు నమోదు అవుతుంటాయి. ఇదే ఈ కాలంలో షేరు ధర పెరగడానికి దోహదపడుతుందని అర్ధం అవుతోంది.దీనికి కారణం కూడా ఉంది. మనకి ఈ మూడు నెలల సమయంలోనే వినాయకచవితి, దసరా,దీపావళితో పాటు ముస్లిం పండగలు కూడా వస్తుంటాయి. మరి ఈ సీజన్‌లో సేమ్యా పాయసం ఖచ్చితంగా కిచెన్‌మెనూలో ఉంటుంది కాబట్టి బాంబినో సేల్స్ పెరుగుతాయనుకోవచ్చు

మరి ఈ లెక్కలు చూసినప్పుడు ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయేమో అన్పించకమానదు. బాంబినో ఆగ్రో ప్రొడక్ట్స్ ఇప్పటిదాకా రూ.310.95 గరిష్టస్థాయి నమోదు చేయగా, 2001 ఆగస్ట్ 9న రూ2.75 కనిష్టస్థాయిగా తెలుస్తోంది. ఐతే క్రమం తప్పకుండా డివిడెండ్ చెల్లించడం విశేషం.రూ.10 ఫేస్ వేల్యూ కాగా, గత జూన్ అంటే క్యూ1లో రూ.27.66కోట్ల అమ్మకాలతో రూ.1.02కోట్ల నికరలాభం ప్రకటించింది. కంపెనీ షేర్ కేపిటల్ రూ. 8.01కోట్లు కాగా, ఆస్తులు రూ.45కోట్లు అప్పులు రూ.64.11కోట్లుగా కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ చెప్తోంది. మంగళవారం నాటి( సెప్టెంబర్ 19) ట్రేడింగ్‌లో బాంబినో ఆగ్రో ప్రొడక్ట్స్ 5శాతం అప్పర్ సర్క్యూట్‌ని లాక్ చేసి రూ.207వద్ద ముగిసింది.

( పై కంపెనీ షేరుని ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ కొనమని,అమ్మమని రికమండ్ చేయడం లేదు. గత త్రైమాసికాల ఆధారంగా రాసిన స్టోరీ ఇది. పర్యవసానాలకు సైట్ బాధ్యత వహించజాలదు)Most Popular