నిలకడగా ట్రేడవుతోన్న మార్కెట్లు

నిలకడగా ట్రేడవుతోన్న మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. ఆల్‌టైం గరిష్ట స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ ఎదురుకావడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే.. సెన్సెక్స్ 20, నిఫ్టీ 10 పాయింట్ల మేర నష్టాల్లోకి చేరుకోగానే.. ఆ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించింది. 

అయితే.. లాభాల్లోకి చేరుకునేందుకు బెంచ్‌మార్క్ సూచీలు ఎంతగా ప్రయత్నిస్తున్నా, అది మాత్రం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం సెన్సెక్స్ 8.6 పాయింట్ల నష్టంతో 32415.16 దగ్గర ఉండగా.. 4.20 నష్టపోయిన నిఫ్టీ 10148.90 దగ్గర ట్రేడవుతోంది. 30 పాయింట్ల నష్టాల్లోంచి 3 పాయింట్ల లాభంలోకి చేరిన బ్యాంక్ నిఫ్టీ 25050.50 వద్ద నిలిచింది.

క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్స్ సెక్టార్లు స్వల్ప నష్టాల్లో ఉండగా, ఆటో మొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. Most Popular