స్వల్ప నష్టాల్లోనే సూచీలు

స్వల్ప నష్టాల్లోనే సూచీలు


దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిలకడగా ట్రేడవుతున్నాయి. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలో రికార్డ్ గరిష్టాలను తాకిన నిఫ్టీ.. ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్ మొదలైన కాసేపటికే నష్టాల్లోకి జారుకోగా.. ప్రస్తుతం అదే స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం 10 పాయింట్ల నష్టంతో 10143 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి 32,398 వద్ద ట్రేడవుతోంది. 38 పాయింట్లు నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ 25,011 దగ్గర నిలిచింది.

హెల్త్‌కేర్, ఆటో, ఐటీ, టెక్నాలజీ సెక్టార్లు పాజిటివ్‌గా ఉండగా, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, పీఎస్‌యూ రంగాల్లోని షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
 Most Popular