లాభాలతో రికార్డ్ ఓపెనింగ్ 

లాభాలతో రికార్డ్ ఓపెనింగ్ 


స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా రికార్డులను కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ మరోసారి ఆల్‌టైం హై లెవెల్‌లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం సానుకూలంగా ప్రారంభం కావడం గమనించాల్సిన విషయం.

ట్రేడింగ్ ప్రారంభంలోనే 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 32500కు చేరువలో ఉంది. 10 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 10162 దగ్గర ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆల్‌టైం గరిష్ట  స్థాయి 10178.95 పాయింట్లను అందుకున్నా.. ఆ స్థాయిని నిలబెట్టుకోవడంలో సూచీ విఫలమైంది.

క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజీ కౌంటర్లలో స్వల్పంగా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుండగా.. ఆటోమొబైల్ షేర్లు మంచి లాభాలు గడిస్తున్నాయి.
 Most Popular