ఈ 3 టెక్ పిక్స్ బాగా పెరుగుతాయ్!!

ఈ 3 టెక్ పిక్స్ బాగా పెరుగుతాయ్!!

మైండ్ ట్రీ
ప్రస్తుత ధర: 469| BUY| టార్గెట్: రూ. 495-505| స్టాప్‌లాస్: రూ. 439

ఆర్ఎస్ఐలో పాజిటివ్ క్రాసోవర్, ఎంఏసీడీలను పరిశీలిస్తే.. మైండ్ ట్రీ స్టాక్స్ టర్నఅరౌండ్ కానుందని.. మళ్లీ అప్‌ట్రెండ్ ప్రారంభించుకోనుందని చెప్పవచ్చు. 
అప్పర్ సైడ్‌లో లాంగ్-టెర్మ్ మూవింగ్ యావరేజ్ 50-డీఈఎంఏ వద్ద, ఆ తర్వాత ఫాలింగ్ ట్రెండ్ లైన్ వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కోనుంది. ఒకవేళ ఈ స్టాక్ తగ్గితే మాత్రం, తాజా స్వింగ్‌లో వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది.

 

లుపిన్
ప్రస్తుత ధర: రూ. 1,008| BUY| టార్గెట్: రూ. 1,120| స్టాప్‌లాస్: రూ. 949
రూ. 920 దగ్గర డబుల్ బాటమ్ ఫార్మేషన్ చూపిన లుపిన్.. ఆ తర్వాత 7 వారాల క్లోజింగ్ హైను చేరుకుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా లోయర్ లెవెల్స్‌నుంచి రివర్స్ కావడంతో.. బ్రేకవుట్‌కు అవకాశాలు ఉన్నాయని సూచిస్తోంది. 

రూ. 1120 దగ్గర ఈ స్టాక్‌కు రెసిస్టెన్స్‌ ఉండగా, ఇది లాంగ్ టెర్మ్ మూవింగ్ యావరేజ్ 100-డీఎస్ఎంఏతో జత కలుస్తోంది. ఈ నెల కనిష్ట స్థాయి రూ. 960 లుపిన్‌కు కీలక రివర్సల్ పాయింట్‌గా నిలవనుంది.

 

యూపీఎల్ లిమిటెడ్
ప్రస్తుత ధర: రూ. 837| BUY| టార్గెట్: రూ. 930| స్టాప్‌లాస్: రూ. 790
సిమ్మెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి యూపీఎల్ బ్రేకవుట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఆర్ఎస్ఐ, ఎంఏసీడీలలో పాజిటివ్ క్రాసోవర్‌ రావడంతో, బ్రేకవుట్ వచ్చేందుకు సపోర్ట్ చేయనున్నాయి.

రూ. 930 స్థాయిలో రైజింగ్ ట్రెండ్ లైన్ వద్ద ఈ స్టాక్ నిరోధం ఎదుర్కోనుండగా.. ఆగస్ట్ నెల కనిష్ట స్థాయి అయిన రూ. 790 యూపీఎల్‌కు మద్దతుగా నిలవనుంది.
 Most Popular