వందకి రూ.25 నుంచి 37రూపాయలు లాభం కావాలా? ఈ స్టాక్స్ చూడండి

వందకి రూ.25 నుంచి 37రూపాయలు లాభం కావాలా? ఈ స్టాక్స్ చూడండి

నిఫ్టీ, సెన్సెక్స్ హయ్యర్ లెవల్స్ వద్ద ట్రేడవుతున్నాయ్. 10వేల పాయింట్ల మార్క్‌పైనే నిఫ్టీ గత వారమంతా నడిచింది. వచ్చే రెండు, మూడు క్వార్టర్లలో మన కంపెనీల్లో డబల్ డిజిట్ గ్రోత్ నమోదవుతుందని కూడా చాలామంది నమ్ముతున్నారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వృధ్ది రేటు, ఆదాయాలు ఇలాంటి అన్ని రకాల అంశాలని పక్కనబెట్టేసి సూచీలు ఇంకాస్త ముందుకెళ్తున్న తరుణమిది. మార్కెట్లలో లిక్విడిటీ విషయానికి వస్తే సమృద్దిగా కన్పిస్తోందని డిఐఐల పెట్టుబడులే చెప్తున్నాయ్. మధ్యమధ్యలో వచ్చే చిన్నపాటి కరెక్షన్స్ మినహా సూచీల జోరుకు అడ్డుపడే సూచనలు కన్పించడంలేదు. కొన్ని స్టాక్స్ వేల్యేషన్స్‌ చూస్తే బాగా పెరిగినట్లు కన్పిస్తున్నాయ్. ఐతే ఈ దశలో కూడా కొన్ని కంపెనీల షేర్లు పెరగడానికి అవకాశం ఉందని మార్కెట్ అనలిస్ట్ క్షితిజ్ ఆనంద్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నడుస్తోన్నబుల్ మార్కెట్ మరి కొన్నాళ్లు పాటు నడుస్తుందని కాబట్టి ఎప్పుడైనా మంచి కంపెనీల షేర్లలో పతనం అయితే వెంటనే వాటిలో కొనుగోళ్లు చేయడం మంచిదని మోర్గాన్‌ స్టాన్లే‌కి చెందిన రిథమ్ దేశాయ్ ఓ నివేదికలో పొందుపరిచారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఓ ఏడాదిపాటు హోల్డ్ చేయగలిగితే 37శాతం వరకూ రిటర్న్స్ ఇవ్వగలిగే ఓ పది కంపెనీలను క్షితిజ్ ఆనంద్ సూచించారు

దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ : cmp:రూ.567.65 టార్గెట్ రూ.610, అప్‌సైడ్‌ పర్సంటేజ్ 10.5శాతం
ఈ స్టాక్‌ని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ రికమండ్ చేస్తోంది. సరిపోయినంత కేపిటల్‌తో హోమ్‌లోన్ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ని దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అందిపుచ్చుకుంటోంది. వచ్చే మూడేళ్లలో లోన్‌బుక్ రేటు 23శాతం పెరుగుతుందని ఏంజెల్ బ్రోకింగ్ అంచనా వేసింది. అలానే ఎర్నింగ్స్ గ్రోత్ కూడా 28శాతం పెరిగే అవకాశముందని చెప్తోంది. ఇప్పుడీ స్టాక్ 2018 ఆర్ధికసంవత్సరపు ఏబివికి 1.8రెట్లుగా ట్రేడవుతోంది

కరూర్ వైశ్యాబ్యాంక్: సిఎంపి-రూ.156.65; టార్గెట్ రూ.180, రిటర్న్ పర్సంటేజ్ 19శాతం
కరూర్ వైశ్యాబ్యాంక్‌కి తానిచ్చే అప్పులపై 14.9శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నమోదవుతోంది. ఇది గత ఆరేళ్లుగా నమోదవడం సంస్థ ఆదాయాలను మెరుగుపరుస్తోంది ఐతే 2017 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం కన్సాలిడేషన్ దశలో 4.7శాతం సిఏజిఆర్ మాత్రమే రికార్డైంది. వచ్చే రెండేళ్లపాటు అప్పుల మంజూరులో 11శాతం వృధ్ది నమోదవుతుందని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ అంచనా. అలానే డిపాజిట్లలోనూ 9శాతం వృధ్దికి అవకాశముందని ఏంజెల్ బ్రోకింగ్ లెక్కగడుతోంది.  వచ్చే మూడేళ్లలో అంటే 2017 ఆర్ధికసంవత్సరం నుంచి 2019 ఆర్ధికసంవత్సరం వరకూ లోన్ బుక్‌లో 11శాతం, సిఏజిఆర్ ఎర్నింగ్స్ ‌లో22 శాతం వృధ్ది నమోదు అవుతుందని కూడా చెప్తోంది. ఈ లెక్కలతోనే కరూర్ వైశ్యాబ్యాంక్ రూ.180కి పెరుగుతుందని ఏంజెల్ బ్రోకింగ్ రికమండ్ చేస్తోంది.

టివిటుడే నెట్‌వర్క్ : CMP 285.00, టార్గెట్: రూ.344, అప్‌సైడ్ పర్సంటేజ్ : 30%
హిందీ,ఇంగ్లీష్ ఛానల్స్ కేటగరీలో టివిటుడేకి తిరుగులేదు. ఆజ్‌తక్ గత కొన్నేళ్లుగా నంబర్ 1 ర్యాంక్ నిలబెట్టుకుంటూ వస్తోంది. ఇంగ్లీష్  ఛానల్ ఇండియాటుడే వ్యూయర్‌షిప్ పెంచుకుంటూ అగ్రభాగాన కొనసాగుతోంది. రేటింగ్స్ పరంగా నంబర్ 2లో ఉంది. ఇక నెట్వర్క్ గ్రూప్‌లోనే ఇతర ఛానళ్లు ఢిల్లీ ఆజ్‌తక్, తేజ్ కూడా పాపులర్ అవుతున్నాయ్ దీంతో వచ్చే రెండేళ్లలో నెట్ రెవెన్యూ సిఎజిఆర్ 9శాతం వృధ్ది చొప్పున రూ.727కోట్లు, నెట్ ప్రాఫిట్ సిఏజిఆర్‌లో 13శాతం వృధ్దితో రూ.121కోట్లు ఆర్జించగలదని ఏంజెల్ బ్రోకింగ్ అంచనా వేస్తోంది

కేఈఐ ఇండస్ట్రీస్: CMP 323.25, టార్గెట్: రూ.371 అప్‌సైడ్ పర్సంటేజ్: 26%
కేఈఐ ఇండస్ట్రీస్ కరంట్ ఆర్డర్ బుక్ వేల్యూ రూ.3233కోట్లు కాగా..ఇందులో రూ.2154కోట్లు ఈపిసి, రూ.667కోట్లు కేబుల్, రూ.200కోట్లు ఈహెచ్‌వి, రూ.49కోట్లు సబ్‌స్టేషన్‌, మిగిలినది ఈపిసి ఎల్1 బిజినెస్‌లవి. గత మూడేళ్లుగా సంస్థ ఓవర్సీస్ వ్యాపారంలో 28శాతం వృధ్ది నమోదు అయింది. ఇది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, పవర్ గ్రిడ్ నుంచి వస్తోన్న ఆర్డర్లతో సాధ్యమైంది. కేఈఐ ఎగుమతుల్లో( మొత్తం రెవెన్యూలో 8-10శాతం ) 14-15శాతం చొప్పున వృధ్ధి చోటు చేసుకుంటుందని అంచనా. ఇది ప్రస్తుతం రూ. 180కోట్ల ఆర్డర్ బుక్ వేల్యూతోపాటు  రూ.500కోట్ల ఇంటర్నేషనల్ టెండర్ల నుంచి వస్తోందని అంచనా.  అలానే సిఏజిఆర్ రానున్న మూడేళ్ల ఆర్ధిక సంవత్సరాల్లో 26శాతం గ్రోత్ రికార్డ్ అవుతుందని ఏంజెల్ బ్రోకింగ్ లెక్కవేసింది. అలానే నెట్ ‌రెవెన్యూలో 14శాతం చొప్పున రూ.3392కోట్లు, నెట్‌ ప్రాఫిట్‌లో 13శాతం సిఏజిఆర్ వృధ్దితో రూ.125కోట్లు ఆర్జింస్తుందని అంచనా

జిఐసి హౌసింగ్ ఫైనాన్స్: CMP రూ.543.60, టార్గెట్: రూ.655 అప్‌సైడ్ : 25%
జిఐసి హౌసింగ్ సంస్థ కొత్త మేనేజ్‌మెంట్ వచ్చే రెండేళ్లలో రెండింతలు లోన్‌బుక్ వేల్యూలో వృధ్ది  లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రూ.16వేలకోట్లకి సమానం. హోమ్‌లోన్ విభాగంలోని డిమాండ్‌ని అందిపుచ్చుకోవడానికి సరిపోయినంత కేపిటల్ వీళ్ల దగ్గర ఉండటం ప్లస్‌పాయింట్‌గా చెప్పాలి. వచ్చే రెండేళ్లపాటు లోన్ బుక్  వేల్యూలో 24.3శాతం పెరుగుదల ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తోంది. రిటన్ ఆన్ అసెట్, రిటన్ ఆన్ ఈక్విటీ  ఈ ఏడాదిలో వరసగా 1.7శాతం, 19శాతం, 2019లో వరసగా 2శాతం, 23శాతం పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం ఈ స్టాక్ 2019నాటి బుక్ వేల్యూ కంటే 2.4రెట్లు ఎక్కువగా ట్రేడవుతోంది

ఇంజనీర్స్ ఇండియా: CMP 157.80, టార్గెట్ రూ.187, అప్‌సైడ్: 18%
ఐఐఎల్‌ సంస్థకి మంచి బ్యాలెన్స్ షీట్, స్ట్రాంగ్ క్యాష్ బ్యాలెన్స్ ఉండటంతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోని అవకాశాలను చక్కగా అందిపుచ్చుకుంటోంది.ఈ రంగంలో ఇది బెస్ట్ కంపెనీగా ఇప్పటికే పేరుతెచ్చుకుంది.  డొమెస్టిక్, ఓవర్సీస్ ఆర్డర్స్‌తో కంపెనీ లాభదాయకత నిలకడగా ఉంది.  కేవలం 8-10నెలల్లోనే రూ.187కి ఎగిసే అవకాశముందని ఎస్ఎంసి గ్లోబల్ సంస్థ సూచిస్తోంది. 

జైన్ఇరిగేషన్స్ సిస్టమ్స్ లిమిటెడ్: CMP రూ.104.15;  టార్గెట్ రూ.177, రిటన్: 37%
దాదాపు రూ.2100కోట్ల ఆర్డర్లతో జైన్ ఇరిగేషన్స్ సంస్థ యమా బిజీగా లావాదేవీలు జరుపుతోంది. ఇందులో రూ.1300కోట్ల రూపాయల వరకూ హైటెక్ వ్యవసాయ పనిముట్లు, ఇతర సామాగ్రికి సంబంధించినవే! మిగిలిన రూ.300కోట్లు ఆహారసంబంధితమైనవి కాగా..రూ.500కోట్లు ప్లాస్టిక్ విభాగంలోనివి. గత కొన్నేళ్లుగా  దేశంలో, విదేశాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యాపారం చేస్తోంది జైన్ ఇరిగేషన్స్, దీంతో  ఆదాయంలో పెరుగుదల నమోదవుతోంది. ఎబిటా లెవల్ ఎర్నింగ్స్‌లో 25శాతం జంప్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. అలానే అప్పులను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఓ కంఫర్ట్ జోన్‌లోకి కంపెనీ వెళ్తోందని ఎస్ఎంసి గ్లోబల్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అప్పులపై వడ్డీ ఇంకా తగ్గనుందని సమాచారం. దీంతో రానున్న 8-10 నెలలకాలంలో రూ.144ని షేరు ధర తాకుతుందని అంచనా


సుప్రజిత్ ఇంజనీరింగ్: CMP రూ.283.50, టార్గెట్ రూ.349, రిటన్: 22%
కేబుల్స్ తయారీ రంగంలో మోస్ట్ ప్రిఫర్‌డ్ కంపెనీగా సుప్రజిత్ ఎదిగింది. ఆటోమేటివ్ సెక్టార్లో  ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫేక్చరర్ల అవసరాల తగ్గట్లుగా ఆర్డర్లు అందించడంలో ముందుంటుంది సుప్రజిత్. ఈ రంగంలో ఇంకా ఎదిగేందుకు ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌పై కూడా దృష్టి పెట్టింది. ఓఈఎమ్(ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫేక్చర్) కంపెనీల నుంచి వస్తోన్న స్పెసిఫిక్ డిమాండ్‌ని, కంట్రోల్ కేబుల్ రంగంలో కంపెనీ మంచి వృధ్ది నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయ్. ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవడం, క్లయింట్ కంపెనీలతో సంబంధాల విషయంలో దృష్టి పెట్టిన సుప్రజిత్ రానున్న రోజుల్లో రెట్టింపు లాభాలను ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. రానున్న 8-10నెలల సమయంలో 31.95 పిఈతో రూ.349ని షేరు ధర తాకుతుందని ఎస్ఎంసి గ్లోబల్ సూచిస్తోంది

టెక్నో ఎలక్ట్రిక్ & ఇంజనీరింగ్ లిమిటెడ్: CMP రూ. 369.05, టార్గెట్ : రూ.461, రిటన్: 29%
మూలధనం పునర్వవస్థీకరణతో ఈపిసి సెగ్మెంట్‌లోకి కంపెనీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కంపెనీ ఆర్డర్ బుక్ పెరుగుతుందని యాజమాన్యం ధీమాగా ఉంది. వచ్చే ఏడాదిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడంతో కంపెనీకి వర్కింగ్ కేపిటల్ మెరుగుపడుతుందని టెక్నో ఎలక్ట్రిక్ అండ్  ఇంజనీరింగ్ లిమిటెడ్ అంచనా వేస్తోంది. ఈ అంచనాతోనే సంస్థ షేరు ధర రూ.461కి ఎగిసే అవకాశముందని ఎస్ఎంసి రికమండ్ చేస్తోంది

అర్వింద్ : CMP రూ.413.10, టార్గెట్: రూ.464, రిటన్: 13%
అప్పెరల్ బ్రాండ్, రిటైల్ ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అర్వింద్ టెక్స్‌టైల్ రంగంలో అగ్రగామి సంస్థ. బ్రాండింగ్‌పై పెడ్తోన్న ఖర్చు బాగా తగ్గడంతో సంస్థ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ బాగా మెరుగుపడుతుందని ఊహిస్తోంది. గార్మెంట్స్ మేకింగ్‌లోని కెపాసిటీ, డిస్ట్రిబ్యూషన్, ఫ్రాంచైజీ మోడల్స్‌తో పెరిగిన ఆదరణతో రెట్టింపు అయింది. అప్పెరల్స్ రంగంనుంచి ఏర్పడుతున్న డిమాండ్‌తో కంపెనీ లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రానున్న 8-10నెలల సమయంలో అర్వింద్ స్టాక్ షేరు ధర రూ.464కి చేరుతుందని ఎస్ఎంసి గ్లోబల్ అంచనా

( పైన చెప్పిన స్టాక్స్‌ని కొనే ముందు రిస్క్ అపటైట్‌ని పరిశీలించుకోగలరు. మీ కొనుగోళ్లకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ బాధ్యత వహించజాలదు)Most Popular