రైస్ స్టాక్స్‌లో సడెన్ ర్యాలీ

రైస్ స్టాక్స్‌లో సడెన్ ర్యాలీ

మిడ్ సెషన్ తర్వాత రైస్ ఎక్స్‌పోర్ట్ కంపెనీల స్టాక్స్‌లో సడెన్ ర్యాలీ కనిపిస్తోంది. బియ్యం ఎగుమతులు చేసే లిస్టెడ్ కంపెనీలకు చెందిన షేర్లు ఒక్కసారిగా మంచి లాభాల్లోకి చేరుకున్నాయి. 5.7  శాతం లాభపడ్డ ఎల్ టీ ఫుడ్స్ ₹ 70.3 మార్క్‌ను అందుకుంది.

కేఆర్‌బీఎల్ షేర్ 3 శాతం పెరిగి ₹ 499కు చేరుకుంది. కోహినూర్ ఫుడ్స్ షేర్ ధర 13 శాతం పెరిగి ₹ 79ను దాటింది. చమన్‌లాల్ సేటియా 3.47 శాతం పెరిగి ₹ 94ను అధిగమించింది. 
 

ఖరీఫ్‌లో పంట సాగు సాధారణ స్థాయిలోనే అంచనాల ప్రకారం జరుగుతోందని.. కరువు తరహా పరిస్థితులు ఎక్కడి నుంచి అందలేదని కేంద్రం వెల్లడించడంతో.. రైస్ ఎక్స్‌పోర్ట్ కంపెనీల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి,

 Most Popular