నష్టాల్లో మొదలైన యూరోప్ మార్కెట్లు

నష్టాల్లో మొదలైన యూరోప్ మార్కెట్లు

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలు.. యూరోప్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అయితే.. ట్రెండ్ కొంత మేర పాజిటివ్‌గా ఉండడంతో.. యూరోప్ సూచీలు స్వల్ప నష్టాల్లోనే ఉన్నాయి.

ఎఫ్‌టీఎస్ఈ 7 పాయింట్ల నష్టంతో 7372 వద్ద ఉండగా.. డాక్స్ 23 పాయింట్ల నష్టంతో 12530 వద్ద నిలిచింది. సీఓసీ 11 పాయింట్లు కోల్పోయి 5206 వద్ద ట్రేడింగ్ జరుపుకుంటోంది.

యూరోప్ మార్కెట్ల ప్రభావం మన ఇండెక్స్‌లపై అంతగా చూపలేదనే చెప్పాలి. ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీలు గత ముగింపునకు చేరువలో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 32200 వద్ద ఉండగా.. నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 10077 వద్ద ట్రేడవుతోంది. 
 Most Popular