వచ్చే వారం నుంచి ఎస్బీఐ లైఫ్ ఐపిఓ... ప్రైస్ బ్యాండ్ రూ.685-700

వచ్చే వారం నుంచి ఎస్బీఐ లైఫ్ ఐపిఓ... ప్రైస్ బ్యాండ్ రూ.685-700

ఎస్బీఐ సబ్సిడరీ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. ఐపిఓ వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతోంది. 2010 తర్వాత మళ్లీ వస్తున్న బిలియన్ డాలర్ (కోల్ ఇండియా) ఐపిఓ ఇది. 

సెప్టెంబర్ 20వ తేదీన ప్రారంభం కాబోయే ఇష్యూ.. 22వ తేదీన ముగియనుంది. అక్టోబర్ 3న లిస్ట్ చేసేందుకు ఎస్బీఐ సన్నాహాలు చేస్తోంది. 

ప్రైస్ బ్యాండ్ రూ.685-700 గా నిర్ణయించారు. కొంత మంది ఎస్బీఐ ఉద్యోగులకు రూ.68 డిస్కౌంట్ ఇస్తున్నారు.  ఈ ఇష్యూ ద్వారా రూ.8400 కోట్లను సమీకరించబోతోంది. 

ఇప్పటికే ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపిఓకు వచ్చింది. త్వరలో హెచ్ డి ఎఫ్ సి లైఫ్ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. 

ఈ ఎస్బీఐ లైఫ్ ఐపిఓలో భాగంగా ఎస్బీఐ తన దగ్గరున్న 8 శాతం వాటాను, బిఎన్‌పి పరిబాస్ కార్డిఫ్ సంస్థ 4 శాతం వాటాను అమ్మబోతున్నాయి. వీళ్లకు ఈ సంస్థల్లో 70, 26 శాతం వాటాలున్నాయి. Most Popular