డోమినోస్ పిజ్జా సీజనింగ్ ప్యాకెట్లలో పురుగులు ! జూబిలెంట్ ఫుడ్స్‌కు చుక్కలు

డోమినోస్ పిజ్జా సీజనింగ్ ప్యాకెట్లలో పురుగులు ! జూబిలెంట్ ఫుడ్స్‌కు చుక్కలు

జూబిలెంట్ ఫుడ్‌వరక్స్ షేర్లు ఏకంగా 8 శాతానికిపైగా పతనమయ్యాయి. సదరు సంస్థలు ఇచ్చే సీజనింగ్ స్యాచెట్లలో బతికే ఉన్న పురుగులు కనిపించాయని, ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపవచ్చని ప్రముఖ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ డాయిష్ బ్యాంక్ వెల్లడించింది. 

ఇండియాలో డోమినోస్ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్న జూబిలెంట్ ఫుడ్ వర్క్స్‌పై సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందని డాయిష్ బ్యాంక్ చెబ్తోంది. 

తాజాగా మెనూలో అనేక మార్పులు చేయడంతో పాటు సేల్స్‌ కూడా కొద్దిగా ఇంప్రూవ్ కావడంతో రీసెర్చ్ సంస్థలన్నీ జూబిలెంట్‌పై పాజిటివ్‌గా ఉన్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

న్యూఢిల్లీలోని ఎంజి రోడ్డులో ఉండే రాహుల్ అరోరా ఒకటి రెండు రోజుల క్రితం చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఆర్డర్ చేసిన పిజ్జాతో పాటు ఇచ్చిన ఓరిగెనో సీజనింగ్‌లో పురుగులు బయటకు వచ్చిన వీడియోను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. 


చివరకు జూబిలెంట్ స్టాక్ 7 శాతానికిపైగా నష్టంతో రూ.1323 దగ్గర క్లోజైంది. వాల్యూమ్స్ కూడా మూడు రెట్లకుపైగా పెరిగాయి. Most Popular