పడగొట్టిన చమురు షేర్లు

పడగొట్టిన చమురు షేర్లు


ఇవాల్టి ట్రేడింగ్‌ చివరి గంట సమయం వరకూ ఇండెక్స్‌లు లాభాల్లోనే ఉన్నా.. చివర్లో ఎదురైన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ నెగిటివ్ జోన్‌లో క్లోజయింది. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజూ లాభాలను ఆర్జించగా.. నిఫ్టీ నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.

హెల్త్ కేర్ సెక్టార్ ఇవాళ కూడా ర్యాలీ చేసి 1.5 శాతం మేర లాభాలను గడించింది. బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ రంగాలు కూడా ముందరి లాభాలను కాపాడుకోలేకపోయినా పాజిటివ్‌గానే ముగిశాయి. ఉదయం నుంచి ఇండెక్స్‌లను ఔట్ పెర్ఫామ్ చేసిన ఆయిల్ అండ్ గ్యాస్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి టాప్ లూజర్‌గా అవతరించింది.

కేపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎఁడీసీ, మెటల్స్, పీఎస్‌యూలతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సెక్టార్లు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌లో లాభాలు కొనసాగడంతో.. మార్కెట్లు పతనం కాకుండా నిలబడగలగిగాయి.

నిఫ్టీలో ఐడియా సెల్యులార్ 4.83 శాతం, టాటా పవర్ 4.75 శాతం, సన్ ఫార్మా 4.05 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్, 3.23 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.59 శాతం లాభాలను ఆర్జించి టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బీపీసీఎల్ 6.67 శాతం, ఐటీసీ 2.27 శాతం, ఐషర్ మోటార్స్ 1.41 శాతం, అంబుజా సిమెంట్స్ 1.33 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.08 శాతం నష్టపోయి నిప్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. 
 Most Popular