మిక్సెడ్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

మిక్సెడ్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ


స్టాక్ మార్కెట్లు ఇవాళ మిక్సెడ్ ట్రెండ్‌తో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో కొనసాగిన మార్కెట్లు మిడ్ సెషన్ దాటేవరకూ అదే ట్రెండ్‌ను కొనసాగించగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ను పట్టించుకోకుండా మన ఇండెక్స్‌లలో పాజిటివ్ ధోరణి కనిపించింది.

ప్రధానంగా ఫార్మా షేర్లు.. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్.. పీఎస్‌యూ బ్యాంకులకు కొనుగోళ్ల మద్దతు కారణంగా మన మార్కెట్లు స్ట్రాంగ్‌గా ట్రేడవుతూ అంతకంతకూ లాభాలను పెంచుకున్నాయి. అయితే.. ట్రేడింగ్ చివరి గంట సమయంలో మాత్రం ట్రెండ్ మారిపోయింది. ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి.

చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం అవలంబిస్తున్న ధరల విధానం మార్చుకోవాలంటూ కేంద్రం చేసిన సూచన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ప్రభావం చూపింది. ఒక్కసారిగా సూచీలు హైయర్ లెవెల్స్ నుంచి దిగి రావడంతో.. ఇతర సంబంధిత కంపెనీల షేర్లు కూడా దిగి వచ్చాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 27.75 పాయింట్ల లాభంతో 32,186.41 వద్ద ఉండగా.. నిఫ్టీ 13.75 పాయింట్ల నష్టంతో 10,079.30 దగ్గర ముగిసింది.
 Most Popular