చమురు కంపెనీలకు ఝలక్ ! ఇక రేట్లు పెంచడానికి బ్రేకులు

చమురు కంపెనీలకు ఝలక్ ! ఇక రేట్లు పెంచడానికి బ్రేకులు

ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకివ్వబోతోంది. పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ రేట్ల పెంపును ప్రస్తుతానికి ఆపాలని సూచించబోతున్నట్టు సమాచారం. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లన్నీ ఒక్కసారిగా నష్టాల బాటలోకి జారుకున్నాయి. సుమారు 6-8 శాతం వరకూ నష్టపోయాయి. 

అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా రోజువారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. ఆయిల్ సంస్థలకు అధికారాన్ని ఇచ్చింది. దీంతో సదరు సంస్థలు ఈ మధ్య రేట్లను బాగా పెంచుకుని.. తమ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేశాయి. అయితే ఇది ప్రత్యక్షంగా సాధారణ ప్రజానీకంపై భారాన్ని మోపుతోంది. పరోక్షంగా దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 

దీంతో చేసేది లేక కేంద్రం ఓఎంసీలపై ఒత్తిడి పెంచనుంది. ఇకపై భారాన్ని వినియోగాదారులపై కాకుండా సదరు సంస్థలే మోయాలనే సమాచారాన్ని ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. Most Popular