మ్యాట్రిమోనీ డాట్‌ కామ్‌ ఐపీఓకు మంచి స్పందన

మ్యాట్రిమోనీ డాట్‌ కామ్‌ ఐపీఓకు మంచి స్పందన

 

సోమవారం పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన మ్యాట్రిమోనీడాట్‌కామ్‌  ఇవాళ మథ్యాహ్నం నాటికి 2.29 రెట్లు  ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 28,11,280 షేర్లకు గాను మొత్తం 64,35,630 బిడ్స్‌ దాఖలైయ్యాయి. 

పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా అర్హతగల కంపెనీ ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 98 డిస్కౌంట్‌ను మాట్రిమోనీ ఆఫర్‌ చేస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంతకుమించి షేర్లు కొనుగోలు చేయాలంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రకటనలు, బిజినెస్‌ ప్రమోషన్‌, చెన్నైలో కార్యాలయం ఏర్పాటు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఇష్యూ ఇవాళ్టితో క్లోజ్‌ కానుంది. Most Popular