బ్లాక్‌డీల్స్‌తో ఐడియా 7 శాతం అప్

బ్లాక్‌డీల్స్‌తో ఐడియా 7 శాతం అప్


ఐడియా సెల్యులార్ కౌంటర్ ఇవాళ భారీ జంప్ చేసింది. ఈ కౌంటర్‌లో భారీగా బ్లాక్ డీల్స్ జరుగుతుండడంతో.. షేర్ ఒక్కసారిగా భారీ లాభాలను గడించింది.

ప్రస్తుతం ఈ కౌంటర్ 5.34 శాతం లాభంతో ₹ 82.90  దగ్గర ట్రేడవుతోంది. ఒక దశలో ₹ 84.45కు చేరుకున్న ఈ  స్టాక్.. ఆ తర్వాత కొంతమేర లాభాల స్వీకరణకు గురైంది. 

ఐడియాకు చెందిన టవర్ బిజినెస్‌ను విక్రయించనుండడం, ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్ టవర్ కార్పొరేషన్, బ్రూక్‌ఫీల్డ్ రేసులో ఉన్నాయనే వార్తలు.. ఐడియా షేరులో లాభాలకు కారణం అవుతున్నాయి.Most Popular