ఆల్‌టైం గరిష్టానికి చేరువలో నిఫ్టీ

ఆల్‌టైం గరిష్టానికి చేరువలో నిఫ్టీ


మార్కెట్లు లాభాలను కొనసాగిస్తున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా ఇండెక్స్‌లు లాభాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్‌ను పట్టించుకోకుండా మన మార్కెట్లలో మాత్రం లాభాలు కొనసాగుతున్నాయి.

ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో కొనుగోళ్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌లో లాభాల జోరు నిఫ్టీని ఆల్ టైం గరిష్టానికి చేరువ చేసింది. 

నిఫ్టీకి గత ఆల్‌టైం గరిష్ట స్థాయి 0,137.85 పాయింట్లు కాగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో 10131.45 పాయింట్ల స్థాయిని అందుకుంది. ప్రస్తుతం దానికి దగ్గరలో 10128.70 దగ్గర ట్రేడవుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ 165 పాయింట్లు పెరిగి 32324 దగ్గర నిలిచింది. అయితే.. రికార్డు గరిష్టానికి 300  పాయింట్ల దూరంలో సెన్సెక్స్ ఉంది. 
 Most Popular