కొత్త గరిష్టాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్

కొత్త గరిష్టాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్


రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర మార్కెట్లను ఔట్ పెర్ఫామ్ చేస్తూ దూసుకుపోతోంది. నిన్నటి లాభాలను కొనసాగిస్తూ పాజిటివ్‌గా ట్రేటింగ్‌ను ప్రారంభించుకున్న ఆర్ఐఎల్.. ప్రస్తుతం 4 శాతం పైగా లాభాలను గడించింది. 

ఎన్ఎస్ఈలో రూ. 859.70 స్థాయిని అందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. గత గరిష్ట స్థాయి అయిన రూ. 832.70ను అధిగమించింది. ప్రస్తుతం ఇదే స్థాయికి చేరువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఈ ఏడాది సెన్సెక్స్ 30 షేర్లలో టాప్2 పెర్ఫామర్‌గా రిలయన్స్ నిలిచింది. 2017లో 56 శాతం పెరిగి బెంచ్ మార్క్ ఇండెక్స్‌లను ఔట్‌పెర్ఫామ్ చేసింది. టాటా స్టీల్ 74 శాతం లాభపడి నెంబర్ స్థాయిలో ఉంది.

జూలై 20న ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించిన తర్వాత.. రిలయన్స్ ఇండస్ట్రీస్ పరుగులు మరింతగా వేగం పుంజుకున్నాయి. 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించడం కూడా షేర్ ధరకు మద్దతు పలికింది. ఆర్ఐఎల్ క్యూ1 ఫలితాలు ప్రకటించిన తర్వాత.. సెన్సెక్స్ సగటున 1 శాతం పెరిగితే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10 శాతం చొప్పున పెరిగిపోవడం విశేషం. 

ఇప్పటికీ ఈ స్టాక్‌లో FY18 ఎబిటా రిస్క్ లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.Most Popular